సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చంద్రబాబు యుద్ధభేరి మోగించిన విషయం తెలిసిందే . ఆయన రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు . జగన్ ఇలాకా పులివెందుల లో స్వల్ప ఉద్రిక్తత మినహా సాఫీ గా సాగిందని చెప్పాలి . అయితే చంద్ర బాబు సొంత జిల్లా లో పుంగనూరు నియోజకవర్గంలో నిన్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరిగిన విషయం తెలిసిందే .. చిత్తూరు జిల్లా పర్యటనలో అంగళ్లు, పుంగనూరులో వైసీపీ నేతలు పోలీసుల ప్రేక్షక పాత్ర తో రెచ్చిపోయి.. రణరంగంగా మార్చారు!. చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి, టీడీపీ వాహనాలను ధ్వంసం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ప్రతిపక్షాలు తీవ్రం గా దుయ్యబడుతున్నాయి .
ఇదిలా ఉండగా జనసేనాని చంద్రబాబు కాన్వాయ్ పై జరిగిన దాడి ని తీవ్రంగా ఖండించారు ప్రతి పక్షం గొంతు వినిపించకూడదనే నియంతృత్వం పెచ్చరిల్లుతోంది. రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వైఖరి ప్రతిపక్షం గొంతు నొక్కేలా ఉందన్నారు పవన్ కళ్యాణ్ . రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలతో ఇబ్బందులుపడుతున్నారు. ప్రజల తరఫున పోరాడటం ప్రతిపక్షాల బాధ్యత. ఈ రోజు పుంగనూరులో చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు వాంఛనీయం కాదు. ఆయన పర్యటనను అడ్డుకొనేందుకు వైసీపీ వ్యక్తులు రాళ్ళ దాడులకు పాల్పడటం, వాహనాలు ధ్వంసం చేయడం అధికార పార్టీ హింసా ప్రవృతిని తెలియచేస్తోంది. పుంగనూరులో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలి.”అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు .
శ్రీ కాళహస్తి లో కూడా హైటెన్షన్..!
చంద్రబాబు పర్యటనను పురస్కరించుకుని టీడీపీ నేతలు శ్రీకాళహస్తిలో తెదేపా భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది . ఫ్లెక్సీలను తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నింగా టీడీపీ నేతలు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకున్నారు. ఇక కాళహస్తి లో చంద్రబాబు పర్యటన లో ఏం ఉద్రిక్తతలు చోటు చేసుకొంటాయో అని తెదేపా శ్రేణులు , ప్రజలు ఆందోళన లో వున్నారు