Saturday, August 13, 2022
spot_img
HomeEditorialతెరమీదకి మళ్లీ జమిలి ఎన్నికల ప్రతిపాదన

తెరమీదకి మళ్లీ జమిలి ఎన్నికల ప్రతిపాదన

రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిందిగా న్యాయ కమిషన్ ను కోరిన కేంద్రం ..... హ్యాట్రిక్ విజయం పై కమలనాథుల గురి

జమిలి ఎన్నికలు …. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ప్రతిపాదన దశ దాటలేదు. కేంద్రం, రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గగలదని అంచనా. ఇప్పటికే ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలను ప్రవేశపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ జమీలి ఎన్నికల కలను సాకారం చేయగలదని భావిస్తున్నారు. ఏకకాల ఎన్నికలు జరిగిన పక్షంలో జాతీయస్థాయిలో బలీయంగా వున్న బిజేపి రాష్ట్రాలలోనూ లబ్ది పొందగలరని కమలనాథులు అంచనా వేస్తున్నారు. జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆచరణ సాధ్యమైన రోడ్ మ్యాప్ రూపొందించాలైందిగా న్యాయ కమిషన్ ను కోరినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారుదీంతో జమిలి ఎన్నికల ప్రతిపాదన మళ్లీ మోగ్గతోడిగినట్టయింది.

నిర్ణీత గడువు ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు 2024 వ సంవత్సరంలో జరగాల్సి వుంది. అంతకంటే ఏడాది ముందే గుజరాత్, కర్ణాటక, తెలంగాణ వంటి పెద్ద రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. జాతీయ స్థాయిలో బిజేపి కి దీటుగా వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సైతం బలీయంగా రూపు దిద్దుకున్నాయి. కేంద్ర, రాష్ట్రాలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదన వెనుక బిజేపి వ్యూహం దాగివున్నట్టు అవగతం అవుతోంది. జమిలి ఎన్నికలు జరిపిస్తే , తద్వారా తమకు లబ్ది చేకూరి కేంద్రంలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయవచ్చని బిజేపి ఉవ్విళ్లూరుతోంది.

దేశంలోని చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలే అధికారంలో వున్నాయి. వాటిలో కొన్ని కేంద్రం లోని ఎన్డీయే ప్రభుత్వం లో భాగస్వామిగా వున్నాయి. మరికొన్ని చోట్ల తటస్థంగా వుంటే మిగిలిన చోట్ల అధికారంలో వున్న ప్రాంతీయ పార్టీల నుంచి బిజేపి కి సవాల్ ఎదురవుతున్నాది. ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన పక్షంలో బిజెపి యేతర ప్రభుత్వాలు ఏర్పడగలవని బిజేపి అంచనా వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ పరిణామం బిజేపి కి ఇబ్బందిగా మారవచ్చని అంచనా వేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే బిజేపి జమిలి ఎన్నికల పై దృష్టి సారించింది అని భావిస్తున్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి జమిలి ఎన్నికలు జరిగే విధంగా రోడ్ మ్యాప్ సిద్ధం కాగలదని అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments