KADAPA: AP CM వైఎస్ జగన్ రెడ్డి సొంత ఇలాకా, పులివెందుల నియోజకవర్గంలో ఆయన కు ఊహించని షాక్ తగిలింది. గతంలోనే పట్టభద్రుల MLC ఎన్నికల్లో పరాభవం , తదుపరి పూలంగాళ్ళ వద్ద చంద్రబాబు భారీ బహిరంగ సభ … ఇలా చెప్పుకొంటూ పొతే పెద్ద లిస్ట్ వుంది .
ఇక వైసీపీ కి షాక్ విషయం లోకి వస్తే : తాజాగా వైసీపీకి చెందిన 30 కుటుంబాలు సైకిలెక్కాయి. వీరంతా వేంపల్లి మండలం తూపల్లె, అలిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వారు. పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి (Btech Ravi)ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛంద చేరికలు జరిగాయి. వైసీపీ కార్యకర్తలందరికీ పసుపు కండువాలు కప్పిన రవి.. టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇవ్వడంతో పాటు.. అన్ని విధాలుగా అండగా ఉంటానని రవి హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో వైకాపా కు రానున్న ఎన్నికల్లో ఏమేరకు పోటీ ఇస్తారో వేచి చూద్దాం …