భారాసా జాతీయ రాజకీయాల్లో NDA లేదా INDIA కూటముల లో చేరాల్సిన అవసరమే లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ . గత 50 ఏళ్ళు గా ఈ కూటములే అధికారంలో ఉన్నాయని , అయినా దేశ ప్రజల స్థితి గతులు మారలేదని కెసిఆర్ ఉద్గాటించారు . భారాసా ఒంటరిగా లేదని , తమ అడుగులో అడుగు వేసే మిత్రులు వున్నారని కెసిఆర్ అన్నారు .
మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిర్ ఒకరోజు పర్యటన లో భాగంగా , వాటేగామ్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. మాతంగి కమ్యూనిటీకి చెందిన ప్రముఖ దళిత కవి, ఆలోచనపరుడు అయిన అన్నాభావూ సాఠే 103వ జయంతి సందర్భంగా జరిగిన ఈ సభ లో కెసిఆర్ఆ ప్రసంగించారు . అన్నాభావూ సాఠే.. మాతంగి సమాజపు ముద్దుబిడ్డ , కమ్యూనిస్టు మరియు అంబేద్కరిస్టు. సమసమాజ స్థాపన కోసం ఆయన తన జీవితాంతం పని చేశారన్నారు . రష్యా లైబ్రరీలో సాఠే విగ్రహముందని , ఇక్కడి ప్రభుత్వాలు ఆయనను గుర్తించకపోవడం, ఆయన సాహిత్యాన్ని మరుగనపరచడం శోచనీయం అని భారాసా నేత కెసిర్ అన్నారు . అన్నాభావూ సాఠే కు భారత రత్న ఇవ్వాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.
కెసిఆర్ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ మహారాష్ట్రలో సందపకు, వనరులక కొదవ లేదని , అద్భుతమైన వనరులు, ఉపాధి అవకాశాలు అపారంగా ఉన్నాయని చెప్పారు. వీటిని సక్రమంగా వినియోగించడంలో ప్రభుత్వాలు విఫలం అయ్యాయని అన్నారు . ఏ పట్టణానికి వెళ్లినా తాగు నీటి కొరత ఉన్నదన్నారు .
గత ఏడాదిగా భారాసా నేత తమ పార్టీ జాతీయ రాజకీయాల్లో భాగం గా తరచూ మహారాష్ట్రలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే కదా … బీఆర్‌ఎస్ మహారాష్ట్ర రాష్ట్ర శాఖ ఇంచార్జిగా కేసీఆర్ తన మేనల్లుడు కల్వకుంట్ల వంశీధర్ రావును నియమించారు. వంశీధర్ రావు కేసీఆర్ అన్నయ్య కల్వకుంట్ల రంగారావు కుమారుడు. అయన నియామకం ఆయన తర్వాత మహారాష్ట్ర లో జరిగిన మొదటి కార్యక్రమం ఇదే కావడం విశేషం .
ఇదిలా ఉండగా తెలంగాణా రాష్ట్ర రైతాంగం కన్నీరు పెడుటెంటే కెసిఆర్ రాజకీయాల కోసం మహారాష్ట్ర వెళ్తారా అని ఢిల్లీలోని తెలంగాణ భావం వద్ద వున్నా అంబేత్కర్ విగ్రహం వద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలసి ఆందోళన చేశారు . నీ అయ్య సంపాదించిన జాగీరు తో పొతే అభ్యంతరం లేదు , తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానం లో వెళ్లావంటే నీకంటే నీచుడెవరూ లేరన్నారు . కేంద్రానికి ఇప్పటివరకూ ఇటీవలి వర్షాల వల్ల జరిగిన నష్టం పై నివేదిక కేంద్రానికి ఇవ్వలేదని , కనీసం లేఖ రాయలేదన్నారు రేవంత్ రెడ్డి .