Saturday, August 13, 2022
spot_img
HomeNewsNationalBreaking News :2002 గుజరాత్ అల్లర్లు.. మోడీ కి సుప్రీంకోర్టు క్లీన్ చిట్

Breaking News :2002 గుజరాత్ అల్లర్లు.. మోడీ కి సుప్రీంకోర్టు క్లీన్ చిట్

2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్ చీట్ ను సుప్రీం కోర్టు సమర్ధించింది. దీనిని సవాల్ చేస్తూ నాడు ఆ అల్లర్లలో చనిపోయిన కాంగ్రెస్ మాజీ ఎంపీ ఈషాన్ జఫ్రీ భార్య జాకియా జఫ్రీ వేసిన పిటీషిన్ ను సుప్రీం తోసిపుచ్చింది.
జస్టిస్ ఖన్విల్కర్,జస్టిస్ దినేష్ మహేశ్వరి,జస్టిప్ సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. సిట్ తీర్పును ఆమోదిస్తూ గతంలో గుజరాత్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తాము సమర్ధిస్తున్నామని..కనుక ఈ పిటీషన్ ను తిరస్కరిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది.

కాగా డిసెంబర్ 8, 2021న ఈ కేసులో విచారణ పూర్తి చేశారు. అయితే అత్యున్నత న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరించింది. ఈ అల్లర్లలో కాంగ్రెస్ ఎంపీ ఈషాన్ జఫ్రీ మరణించారు. ఇక గుజరాత్ అల్లర్ల సమయంలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్నారు. మోడీ అమిత్ షా తో పాటు ఇతర రాజకీయ నేతలపై 2006లో జాకియా జఫ్రీ ఈ కేసు వేశారు. ఇన్నాళ్లపాటు సాగిన విచారణ తరువాత గుజరాత్ హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీం క్లీన్ చిట్ ఇచ్చింది.. అనేకమంది దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.. ఇక విపక్షాలు ఏమంటాయో వేచి చూడాల్సిందే…

RELATED ARTICLES

Most Popular

Recent Comments