Tuesday, January 21, 2025
spot_img
HomeElections 2023-2024కాంగ్రెస్లోకి బీజేపీ&బిఆర్ స్ టాప్ లీడర్స్ రీ ఎంట్రీ

కాంగ్రెస్లోకి బీజేపీ&బిఆర్ స్ టాప్ లీడర్స్ రీ ఎంట్రీ

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత బారాసా పార్టీ బాగా బలహీనపడింది,కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది అనే చెప్పాలి ఎందుకంటె ,ఇవాళ చాలా మంది బిఆర్ స్ నేతలు కార్యకర్తలు ,గల్లీ నేతలు ,కార్పొరేటర్లు ,కౌన్సిలర్లు ,mla లు ,mp లతో సహా బిఆర్ స్ ని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారు . ఇంకోవైపు సొంతపార్టీ నేతలు ఎన్నికలు అపుడు రేవంత్ రెడ్డికి పద్ధతులు నచ్చక అలిగివెళ్ళిన వారు సైతం తిరిగి సొంత గూటికి తిరిగి వస్తున్నారు . అసెంబ్లీ ఎలక్షన్స్ టైములో టికెట్ ఆశించి బంగపడినవారు ,మాకు సముచిత స్తానం ఇవ్వలేదు మాకు మర్యాద ఇవ్వలేదు అనికొంతమంది కాంగ్రెస్ ని వీడి వెళ్లిన వారు సైతమ్ తిరిగి సొంత గూటికి చేరుతున్నారు . అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు రాజకీయముగా ఎదగటం కోసం పార్టీని వీడి బిఆర్ స్ లో జయినా అయ్యారు ,నేడు అదే బిఆర్ స్ చిత్తుగా ఓడిపోవటంతో ,అదికాక గతకొంతకాలం గ గులాబీ దళపతి కెసిఆర్ ,వారి కుమారుడు కేటీర్ వైఖరి నచ్చకపోవడంతో చేసేదిలేక తిరిగి సొంతగూడు అయినా కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు .

BJP & BR’s top leaders re-entry into Congress

ఆఖరికి ప్రతిపక్ష హోదాకూడా లేకుండా బిఆర్ స్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే బిఆర్ స్ నాయకుల్లోనే అసమ్మతి కనపడుతున్నట్లు స్పష్టముగా కనపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ తరుణములో బిఆర్ స్ లో ఉండి రాజకీయముగా లబ్ది పొందలేము అని నేడు బిఆర్ స్ నాయకులు అందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . రేవంత్ రెడ్డి కి హితులు సన్నిహితులు అయిన వెం నరేందర్ రెడ్డి తో కాంగ్రెస్ ని వీడి వెళ్లిన వారందరు మాజీ కాంగ్రెస్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం . ఇప్పటికే గతంలో కాంగ్రెస్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. వీరుకూడా బిఆర్ స్ పార్టీలో తొమ్మిదియేళ్లు ఉన్నారు ఏ పదవి దక్కక గోర అవమానాలు ఎదురుకొన్నారు కచర్ల చంద్రచెకర్ రెడ్డి అనే చెప్పాలి . అంతేకాక సత్తుపల్లి టికెట్ ఆశించి భంగపడి తనని పట్టించుకోలేదు సరి అయినా మర్యాద ఇవ్వలేదు అని ఆ టైములో అలిగి మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ సమక్షంలో బిఆర్ స్ లో జాయిన్ అయ్యారు విద్యార్థి సంగ నేత మానవతా రాయ్ . వీరు కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు పార్టీకి అండగా ఉండి ,కెసిఆర్ చేసిన అరాచకాలని ఎండగట్టారు అని చెప్పాలి ,వీరు కూడా రేవంత్ రెడ్డి సన్నిహితులు ప్రభుత్వ అడ్వైజర్ అయిన వెం నరేందర్ రెడ్డి తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది . మానవతారాయ్ కూడా త్వరలోనే తిరిగి సొంతగూడు అయినా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా చెప్పాలి అంటే దానం నాగేందర్ వైస్సార్ హయాములో కాంగ్రెస్లో ఉన్నారు ,ఆ తరువాత బిఆర్ స్ లో చేరారు ,ఎపుడు అయితే బిఆర్ స్ పార్టీ ఓడిపోయిందో మళ్ళి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు ఇపుడు సికింద్రాబాద్ ఎంపీ రేసులో ఉన్నారు .

వారిని సికింద్రాబాద్ బరిలో దింపాలి అని కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ఆలోచించింది అని వార్తలు వినిపిస్తున్నాయి .ఇంకోవైపు బిఆర్ స్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కూడా ,బిఆర్ స్ అధ్యక్షుడు కెసిఆర్ కేటీర్ నోటిదురుసు విధి విధానాలు నచ్చక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు,నేడు అదే చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా రేసులోఉన్నారు ,కాంగ్రెస్ అధిష్టానం కూడా రంజిత్ రెడ్డికి సీటు కన్ఫామ్ చేసింది . అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ బలపడింది అనే చెప్పాలి ,దీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి ,ఇపుడు రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యం పార్లమెంట్ స్థానాలు 17 కు గాను 15 స్థానాలు కైవసం చేసుకోవాలి అని విస్తృత ప్రచారం చేస్తున్నారు . సరిఅయిన టైముకు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటున్నారు . ఇక్కడ చెప్పుకోవలసిన ప్రధాన అంశం ఏమిటంటే ,పాతవి ఏవి మనసులో పెట్టుకోకుండా కాంగ్రెస్ ని వదిలి వెళ్లిన ప్రజా నేతలు ఎవరు అయితే ఉన్నారో ,తిరిగి వచ్చిన వారందరికి కాంగ్రెస్ కండువా కప్పి సొంతగూటికి ఆహ్వానిస్తున్నారు రేవంత్ రెడ్డి . ఇలా చూసుకుంటూ వెళితే చాల మంది నేతలు కారుని ఖాళీ చేసి సొంతగూడు అయినా కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments