Friday, November 22, 2024
spot_img
HomeElections 2023-2024Bhupalapally Assembly Analysys 2023

Bhupalapally Assembly Analysys 2023

భూపాలపల్లె అసెంబ్లీ నియోజకవర్గం : గతం లో అంటే 2009 నియోజకవర్గాల పునర్ విభజనకు ముందు శాయంపేట నియోజకవర్గం గా ఉండేది. 2009 నుండీ భూపాలపల్లి గా మారింది . భూపాలపల్లి నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో ఇది ఒకటి . ఇది వరంగల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.  ఈ నియోజకవర్గంలో 6 మండలాలు వున్నాయి . 1. భూపాలపల్లి . 2 మొగుళ్ళపల్లె ..3. చిట్యాల 4. ఘనపూర్ 5. రేగొండ ..6. శ్యాంపేట్ .

ప్రస్తుత శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్ టికెట్ పై ఇక్కడ గెలుపొంది , తరువాత భారాస లో చేరారు . ఇక్కడ గతంలో మధుసూధనాచారి , భారాసా వ్యవస్థాపక సభ్యుడు 2014 లో mla గా గెలుపొందారు . మధుసూధనాచారి అక్టోబర్ 2001లో జనరల్ సెక్రటరీగా, పొలిట్‌బ్యూరో సభ్యుడు గా , పార్టీ అధికార ప్రతినిధిగానూ పనిచేశారు . మేధావి ిన ఈయన ప్రొ.జయశంకర్‌కు అత్యంత సన్నిహితుడిగానూ పనిచేశారు. రెండు సార్లు ఈ నియోజకవర్గంలో ఓడిన పిదప ప్రస్తుతం MLC గా వున్నారు . గతంలో తెలంగాణా రాష్ట్ర మొదటి స్పీకర్ గా పనిచేశారు .

2018 bhupalapalli election result

మధుసూధనాచారి వర్గీయులనుండీ తీవ్రమైన వ్యతిరేకత ను గండ్ర వెంకటరమణారెడ్డి ఎదుర్కొంటున్నారు . గతం లో శాయంపేట నియోజకవర్గం గా వున్నప్పుడు కొండా సురేఖ 1999 లో 2004 లో వరుస విజయాలు సాధించారు . అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో గండ్ర సత్తెన్న గా పిలువబడే సత్యన్నారాయణ రావు బలమైన పోటీదారు గా మారారు . ఇక భాజాపా విషయానికి వస్తే గతం లో ఇక్కడ పోటీ చేసి ఓడిన చందుపట్ల కీర్తి రెడ్డి ప్రధాన పోటీ దారు గా వున్నారు . ఇక చాడ సురేష్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది . ఇక్కడ గతం లో శాయంపేట అసీంబ్లీ కి జరిగిన ఎన్నికల్లో 1978 లో జంగారెడ్డి (జనతా) , 1983 లో జంగారెడ్డి వరుసగా విజయం సాధించారు . మరింత రాజకీయ విశ్లేషణ కోసం ఈ కింది వీడియో చూడగలరు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments