తెలంగాణ బిడ్డకు పివి కి భారతరత్న
యావత్ భారతదేశం గర్వించదగ్గ మహానాయకుడు,తెలంగాణ బిడ్డ తెలుగుజాతి అణిముత్యం, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారత మాజీ ప్రధానమంత్రి శ్రీ పి వి నరసింహారావు గారికీ కేంద్రప్రభుత్వం భారతరత్న బిరుదును ప్రకటించడం ముఖ్యముగా తెలంగాణ ప్రజలకు ఏంటో సంతోషం కలిగించే వార్త .
విశిష్ట పండితుడు,రాజనీతిజ్ఞుడిగ ,పలు భాషాకోవిదుడిగా పివి నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో నిరంతరాయ సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు.
ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా,భారతదేశ ప్రధానిగా ,అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని భారతదేశం గుర్తుంచుకుంటుందని ప్రధాని మోడీ అన్నారు .
భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో పివి నరసింహారావు గారి దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందని మోడీ అన్నారు .
1991 – 96 వరకు భారత ప్రధానిగా పీవీ నర్సింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పీవీ నర్సింహారావు సేవలందించారు. పీవీ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు.
పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ కు సైతం కేంద్రం భారత రత్న ప్రకటించింది.
ఈ విషయాన్ని ప్రధాని మోదీ స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
ఇటీవలే ఎల్ కే అడ్వాణీ, కర్పూరీ ఠాకూర్‌కు కూడా భారతీయ ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరితో రికార్డు స్థాయిలో మొత్తం ఐదుగురికి ఈ సంవత్సరం 5 భారతరత్న అవార్డులు ప్రకటించినది కేంద్రము .
మాములుగా సంవత్సారానికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ సంవత్చరం మాత్రం ప్రభుత్వం ఐదుగురికి ప్రకటించడం విశేషం.
తెలంగాణ బిడ్డ ,రాజనీతిజ్ఞుడు పలు బాషా కోవిదుడు పివి నరసింహారావు కు భారతీయ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించటంతో ,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేడర్ , సంబరాలు జరుపుకుంటుంది .