TDP Supremo chandrababu KOTTAPETA (EastGodavari) : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన తూర్పు గోదావరి జిల్లాలో జోరుగా సాగుతోంది. రెండోరోజు కొత్తపేట నియోజకవర్గంలో కొనసాగింది. ఈ నియోజకవర్గం లో మాజీ MLA బండారు సత్యానందరావు తన సత్తా చాటారు . కార్యకర్తలు , అభిమానులు చంద్రబాబు కార్యక్రమాలకు కొత్తపేట లో ఉత్సాహంగా పాల్గొన్నారు . మధ్యాహ్నం మండపేట నుంచి బయలుదేరిన చంద్రబాబు..ఆలమూరు వద్ద భవిష్యత్ కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణం చేసారు. బస్సులోని మహిళలతో ఆయన మాట్లాడారు. భారంగా మారిన నిత్యావసర వస్తువుల ధరలు, ప్రభుత్వ పన్నుల పై మహిళలు తమ అవేదన చంద్రబాబు తో చెప్పుకున్నారు.
ప్రభుత్వ పనితీరు… రోడ్ల పరిస్థితిపై బస్సులో మహిళలు , ఇతర ప్రయాణికుల నుంచి చంద్రబాబు ఆరా..చంద్రబాబుతో పాటు మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ లోక్సభ ఇన్చార్జ్ గంటి హరీష్మాధుర్ బస్సులో ప్రయాణించారు .
కొత్తపేట వెళుతూ జొన్నాడ లో ఇసుక డంపింగ్ ప్రాంతాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు. వైసీపీ ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక దోపిడీ సాక్షిగా సెల్ఫీ తీసారు. జొన్నాడ ఇసుక గుట్టల వద్ద సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. జొన్నాడ లో ఇసుక డంపింగ్ ప్రాంతాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు. ఇసుక తవ్వకాలపై అక్రమాలను ప్రశ్నించారు. ఎటువంటి పత్రాలు లేకుండా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగుతున్న విధానాన్ని, ఇసుక మాఫియా ఆగడాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రాంతం లో వైసీపీ నేతల ఇసుక దోపిడీ పై ప్రజలు చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఇసుక తవ్వకాలు ఎవరు చేస్తున్నారు, ప్రభుత్వం కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, తవ్వకాలు, అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.
అనంతరం చంద్రబాబు గౌతమీ గోదావరి వంతెన మీదుగా రావులపాలెంకు రోడ్డు షో నిర్వహించారు. రోడ్ షో ఆసాంతం జనసంద్రాన్ని తలపించింది . జై చంద్రబాబు.. జైజైచంద్రబాబు నినాదాలతో కోనసీమ ముఖద్వారం హోరెత్తింది..అడుగడుగునా చంద్రబాబుకు నీరాజనం పలికారు..నువ్వు కావాలయ్యా.. రావాలయ్యా.. మా జీవితాలు మార్చాలయ్యా అంటూ పెద్ద ఎత్తున నినా దాలు చేశారు.గౌతమి నదీపై జొన్నాడ-రావులపాలెం బ్రిడ్జి మీదుగా భారీ ర్యాలీతో రావులపాలెం కాలేజీ వద్దకు వచ్చే సరికి బాణసంచాతో వేలాదిమంది ఘనస్వాగతం పలికారు. రావులపాలెం వంతెన వద్ద నుంచి సభా ప్రాంగణానికి రావడానికి కిలోమీటరు మేర పర్యటనకు గంటకు పైగా వ్యవధి పట్టింది. పూల గజమాలలు , కుంసంపూడి రామరాజు గారి పూతరేకుల గజమాలతో సభావేదిక వద్ద స్వాగతమిచ్చారు .
మహాత్మాగాంధీ కాంప్లెక్స్ సెంటర్ వద్ద బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. ఇక్కడ ఎమ్మెల్యే చిర్ల కాదు.. చిల్లర జగ్గిరెడ్డి. ఇతను చేస్తున్న అవినీతి అక్రమాలు అన్ని ఇన్నీ కావని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగ్గిరెడ్డి మరలా రేపు ఉండదు గుర్తుపెట్టుకో.. ఇప్పుడే చూశా నీ అవినీతి గుట్ట. ఖబడ్డార్ జాగ్రత్తగా ఉండు. సైకో ముఖ్యమంత్రిని అడుగుతున్నా గుట్టలు.. గుట్టలు తవ్వావే..దీనికి ఎక్కడ అనుమతి ఉందని… దీనికి కాంట్రాక్టర్ ఎవరు.. ప్రభుత్వానికి ఆదాయం వస్తోందా.. ఇది ప్రజల సంపద. సహజ వనరులను భగవంతుడు ఇచ్చిన ఇసుకను సైతం నువ్వు దోచేయాలని అనుకుంటున్నావు.నిన్ను ప్రజాకోర్టులో బోను ఎక్కించే బాధ్యత నేను తీసుకుంటా. ఏం తమ్ము ళ్లూ ఈ చిల్లర జగ్గిరెడ్డి అవినీతిని మీరు క్షమిస్తారా.. వదలిపెడతారా అంటూ ప్రశ్నించారు. ఏ వ్యక్తయినా క్యాన్సర్ వస్తే జాగ్రత్తగా ఉండాలా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ క్యాన్సర్ గడ్డ రాష్ట్రానికే ప్రమాదం అని తొలగించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని జగన్ను ఉద్దేశించి అన్నారు. పేదలకు నిలువు దోపిడీ చేస్తున్నారని..పిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రావులపాలెం బహిరంగ సభ సక్సెస్ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును చంద్రబాబు అభినందించారు. రావులపాలెం బహిరంగ సభ అనంతర చంద్రబాబు నిన్న రాత్రి అమలాపురం చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ అమలాపురంలో రోడ్డు షో, బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు.