Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshఆంధ్ర ప్రదేశ్ కు . 15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చింది ... పురంధరేశ్వరి

ఆంధ్ర ప్రదేశ్ కు . 15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చింది … పురంధరేశ్వరి

Daggupati Purandeswari ఏపీబీజేపీ అధ్యక్షురాలు On AP Debts: ‘రాష్ట్ర ప్రభుత్వ అనధికారిక అప్పు రూ.10.77 లక్షల కోట్లు’ అని చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకుకు చూపించిన రూ. 15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందని , ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి రఘురామకృష్ణరాజు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు జవాబుగా నిర్మలా సీతారామన్‌.. RBI పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల గురించి మాత్రమే సమాధానం చెప్పారన్నారు.

ఆ జవాబులో రాష్ట్ర ప్రభుత్వం.. కార్పొరేషన్లను తాకట్టు పెట్టి రూ. 98 వేల కోట్లు,

ప్రభుత్వ ఆస్తుల తనఖా పెట్టి మరో రూ. 98 వేల కోట్లు,

సోషల్‌ సెక్యూరిటీ బాండ్ల ద్వారా రూ. 8 వేల 900 కోట్లు,

ఏపీ ఫైనాన్సియల్‌ సర్వీసుల ద్వారా తీసుకున్న రూ.10 వేల కోట్ల రుణం..

ఇలా అనధికారికంగా తీసుకున్న రుణాలన్నీ కలిపితే మొత్తం 10 లక్షల 77 వేల కోట్ల అప్పులున్నాయని పురంధరేశ్వరి తెలిపారు. ఈ నాలుగేళ్ల వైసీపీ పాలనలో ఎలాంటి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాకుండా ఆంధ్ర రాష్ట్ర ఆదాయం ఏవిధంగా పెరిగిందనేది ప్రశ్నార్ధకమని ఆమె అన్నారు . రూ. 15 లక్షల కోట్ల ఆదాయం ఎలా వచ్చిందనే విషయంపై వైకాపా ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని పురంధరేశ్వరి డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments