అమరావతీ R5 zone లో జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్ట్ ఫుల్ బెంచ్ ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వం R5 జోన్ లో ఆర్భాటం గా తలపెట్టిన నిర్మాణ కార్యక్రమానికి చెక్ పెట్టినట్లే .
రాజధాని అమరావతిలో ఆర్ 5 జోన్ CRDA చట్టాన్ని సవరించి తెచ్చిన యాక్ట్ 13/2022, జీవో 45 లను అక్రమం అంటూ సవాల్రా చేసిన రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ, ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు ఆంధ్ర ప్రదేశ్ సర్వోన్నత న్యాయ స్థానం లో అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తదుపరి ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
దేనితో ఒక పక్క సాగునీటి ప్రాజెక్టులు ఆంటూ చంద్రబాబు , ఇంకో వైపు నుంచీ యువగళం అంటూ నారా లోకేష్ , మూడో వైపునుంచీ వారాహి 3 వ విడత యాత్ర తో జనసేనాని తో అప్పుల పద్దుల లెక్కలు అంటూ పురంధరేశ్వరి చుట్టుముట్టిన తరుణం లో మూలిగే నక్క పై తాటిపండులా ఈ R5 zone లో నిర్మించ తలపెట్టిన ఇళ్ల పై స్టే రావడం తో ముఖ్యమంత్రి జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారనడం లో ఎలాంటి సందేహం లేదు . ఇటీవల డైవెర్షన్ పాలిటిక్స్ ను జనం నమ్మడం మానేశారు మరి…