భారతీయ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గారికి BJP Andhra Pradesh అధ్యక్షురాలు శ్రీమతి Daggubati Purandeswari గారి లేఖ.
విషయం :
శ్రీ విజయ్ సాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ, తన పైన ఉన్న CBI/ED కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయవ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాల పైన విచారణ కొరకు అభ్యర్థన.
మీకు నమస్కరించి వ్రాయు లేఖ,
అధికారంలో ఉన్న ఏపీ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్‌లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్న సందర్భంలో భయంతో జీవిస్తున్న ప్రజల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు నిత్యం అందుకుంటున్నాను.
వీరు భారతదేశ లోని ప్రధాన దర్యాప్తు సంస్థలు (CBI, IT మరియు ED) వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు. న్యాయవ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటిని పదేపదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయిచుకోవడం మరియు విచారణకు హాజరుకాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్ లో ఉంచడం ద్వారా ప్రయోజనం పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయం ఆలస్యం చేస్తున్నారు.
విజయ సాయి రెడ్డి IPC క్రింద నమోదు అయినా ఈకేసులు పరిశీలిస్తే మనసును కదిలించక తప్పదు :
మోసం చేయడం మరియు అనైతికంగా ఆస్తులు లేదా సంపద సమకూర్చుకునే విధంగా ప్రేరేపించడం వంటి 11 అభియోగాలు (IPC సెక్షన్-420)
నేరపూరిత కుట్రకు సంబంధించిన శిక్షకు సంబంధించిన 11 అభియోగాలు (IPC సెక్షన్-120B)
మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించిన 6 అభియోగాలు (IPC సెక్షన్-468)
పబ్లిక్ సర్వెంట్ లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత విశ్వాస ఉల్లంఘనకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-409)
నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్‌ను అసలైనదిగా ఉపయోగించేందుకు సంబంధించిన 2 అభియోగాలు (IPC సెక్షన్-471)
ఖాతాల తప్పుడు సమాచారం (IPC సెక్షన్-477A)కి సంబంధించిన 1 అభియోగం.
పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాలలో విజయసాయి రెడ్డి కుట్రపూరిత ఆలోచనలు, తిమ్మిని బమ్మి చేయగలిగే సామర్ధ్యాల పరిధిని తెలియజేస్తాయి.
బెయిల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ (సిబిఐ) కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల నుంచి జగతి పబ్లికేషన్స్‌లోకి (ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబానికి చెందినవారు) పెట్టుబడులు పెట్టి నల్లధనాన్ని తెల్లగా మార్చడంలో విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆరు దేశాలకు పంపిన రొగేటరీ లేఖలతో ( విదేశాల నుండి సమాచారం తెప్పించుకొని లేఖలు ) ట్రయిల్‌తో సహా దర్యాప్తును ఎలా ప్రభావితం విజయసాయి రెడ్డి చేయగలడో కూడా వివరించబడింది.
కడప ఎంపీ గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నమోదైన అక్రమ ఆస్తుల కేసులో రెండో నిందితుడు వి.విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి .ఏప్రిల్ 2012లో ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సాయిరెడ్డిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ‘కింగ్‌పిన్’ ( మూల విరాట్ ) గా పేర్కొంది.
విజయసాయిరెడ్డి బెయిల్ మంజూరు కోసం కోర్ట్ కొన్ని షరతులు విధించింది. అతని పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, కోర్ట్ అనుమతి లేకుండా హైదరాబాద్‌ను విడిచిపెట్టకూడదని, సీబీఐకి అందుబాటులో ఉండాలని, కేసు వాస్తవాలు తెలిసిన వారినెవరిని బెదిరించకూడదని లేదా ప్రభావితం చేయకూడదని మరియు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో పాటు రూ.25,000 బాండ్ సమర్పించాలని ఆదేశించింది.
అతనిపై ఉన్న కేసుల వివరణాత్మక జాబితా ఈ లేఖకు జతచేయబడింది.
జాబితాలో పొందుపరచిన ఈ నేరాలన్నీ వారు తక్కువ ప్రభావవంతమైన పదవులలో ఉన్నప్పుడు నమోదు చేసినవి, ఇప్పుడు వారు అత్యున్నత అధికార పదవుల స్థానాల్లో ఉన్నారు మరియు నేడు ఆంధ్రప్రదేశ్ లో అనేక వేల కోట్ల అక్రమ మద్యం అమ్మకాల ద్వారా ప్రజా సంపద దోచుకోవడానికి మరియు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బకొట్టే విధంగా వారి పలుకుబడిని ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముందు నిధులు సమకూర్చి మరియు తరువాత అప్రూవర్ గా మారిన వారు ఏపీలో ఉన్న విజయసాయి రెడ్డి దగ్గరి బంధువులు అనేది గమనించాలి.
విజయసాయి రెడ్డి తన బినామీల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని డిస్టలరీలను నిర్వహిస్తున్నట్లు మా విచారణలో బయటపడింది. ఈ అంశం వెలుగులోకి రాగానే ఏపీ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేయాలని కేంద్ర హోంమంత్రికి లేఖలు మేము రాయడం జరిగింది. ఇది కాకుండా, విజయసాయి రెడ్డి రాష్ట్రంలో తమ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు ఉత్తర కోస్తా ఆంధ్రాకి ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు, అతను చాలా మందిని బెదిరించి వారి ఆస్తులు కబ్జా చేయించాడు మరియు బలవంతంగా డబ్బు వసూళ్లు చేశారు, దీనికోసం సీఎమ్ స్వంత జిల్లా కడపా నుండి తెప్పించిన గూండాలను ఉపయోగించి తనకు మరియు తన పార్టీకి డబ్బు వసూలు చేశాడు, అలాగే అనేక మంది వ్యాపారవేత్తలు / రియల్టర్లను బెదిరించి నామ మాత్రపు డబ్బు చెల్లించి అతని కుటుంబ సభ్యులు/ కూతురు/అల్లుడు కంపెనీల కోసం అనేక ఎకరాల విలువైన భూమిని తమ అధికారణి అడ్డుపెట్టుకొని కొనుగోలు చేశాడు.
విశాఖపట్నం సమీపంలోని భీమిలి అక్రమ మార్గాలలో రాబట్టుకున్న భూముల మార్కెట్ విలువ దాదాపు 177 కోట్లు కాగా, విజయ సాయిరెడ్డి కుమార్తె కంపెనీ వాటిని కేవలం 57 కోట్ల రూపాయలకు నామమాత్రపు చెల్లింపులతో కొనుగోలు చేసింది.
వాస్తవానికి విజయ సాయి రెడ్డి దస్పల్లా భూములను (నగరం నడిబొడ్డున ఉన్న ప్రధాన భూమి) బెదిరించి అభివృద్ధి ప్రాతిపదికన భూ యజమానులకు నామమాత్రపు వాటాతో స్వాధీనం చేసుకోవడంలో కూడా సూత్రధారిగా ఉన్నాడు. ఈ భూమి అభివృద్ధి ఒప్పందంపై జూన్ 2021లో ఒడిశాలోని దస్పల్లా రాజకుటుంబం అష్యూర్ ఎస్టేట్స్ డెవలపర్స్ ఎల్‌ఎల్‌పితో సంతకం చేసింది, ఇందులో సాయిరెడ్డి కుమార్తె మరియు అల్లుడు డైరెక్టర్‌లుగా ఉన్నారు.
న్యాయ వివాదంతో అప్పటి వరకు ప్రభుత్వ నిషిద్ధ జాబితాలో ఉన్న దస్పల్లా భూములు ఈ ఒప్పందం కుదిరిన వెంటనే నిషిద్ధ జాబితా నుంచి తొలగించారు.
విశాఖపట్నానికి రాజధాని స్థాపన/మార్పిడి గురించి ముందస్తు సమాచారంతో అక్కడ విరివిగా ఆస్తులను సంపాదించేందుకు విజయసాయి రెడ్డి ఈ బెయిల్ ఉపయోగించుకున్నాడు.
మరొక సందర్భంలో అతని బంధువులు/బినామీలు రుషికొండలోని బే పార్క్ రిసార్ట్‌ను బలవంతంగా తక్కువ ధరకు రాబట్టుకొని, అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వద్ద తన పలుకుబడిని ఉపయోగించి 33 సంవత్సరాల నుండి 99 సంవత్సరాలకు లీజుకు మార్చిన తర్వాత దానిని యజమానులకు తిరిగి విక్రయించారు.
ముఖ్యంగా భూమి / ఇసుక / మైనింగ్ మరియు మద్యంలో అతని చురుకైన ప్రమేయంతో అతని బినామీల అనేక ఉదాహరణలు ఉన్నాయి.
ఇప్పుడు నేను ఈ సమస్యలలో కొన్నింటిని బాధ్యత కలిగిన పౌరునిగా ప్రజాబాహుళ్యంలో లేవనెత్తినప్పుడు, బహిరంగంగా విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి నన్ను బెదిరించాడు.
నేను ఇటువంటి అంశాలను నా వద్ద ఉన్న సమాచారంతో భవిష్యత్తులో మాట్లాడితే, నన్ను ప్రజల మధ్య బయట తిరగకుండా చేస్తానని వ్యక్తిగత దూషణలతో విజయసాయి రెడ్డి నన్ను బెదిరించారు.
విజయసాయి రెడ్డి కి వ్యతిరేకంగా ఎవరైనా సాక్ష్యం చెప్పే ధైర్యం ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో అటువంటి వారిని ఎలా బెదిరించగలడనే దానిపై నన్ను బెదిరించిన తీరు చాలా శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. విజయసాయి రెడ్డి కేసుల్లో ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను లేదా సాక్షులను కూడా అతను ఎలా బెదిరించి గలడో అర్ధం చేసుకోవచ్చు . ఆంధ్రప్రదేశ్ లో సమాజంలో పెద్దలు, వ్యాపారవేత్తలు సాధారణ ఫోన్లలో మాట్లాడలేకపోతున్నారని, వీళ్లకు భయపడి వాట్స్ యాప్ కాల్స్ లేదా పేస్ టైం లు మాత్రమే వాడుతున్నారనే భయం నెలకొంది.
ఈ బహిరంగ బెదిరింపులను బెయిల్ షరతుల ఉల్లంఘనగా పరిగణించాలని మరియు గత 10 సంవత్సరాలు పైగా అనేక ఉల్లంఘనలతో అతను వ్యవస్థలను ఎలా నియంత్రించగలుగుతున్నాడో పరిశీలించి, విజయసాయి రెడ్డి బెయిల్‌ను పొడిగించడాన్ని పరిశోధించాలని నేను దయతో మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
ఇంతకు ముందు జరిగిన ఒక సంఘటనలో కూడా మాజీ ఎంపీ శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో నరికి హత్య చేసినప్పుడు.. ప్రెస్ మీట్ పెట్టి అది కేవలం గుండెపోటు, సహజ మరణమని చెప్పిన మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి అనే అంశం పరిగణలోకి తీసుకోవాలి. ఇది ఆయన సొంత పార్టీ వారు, శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి వంటి బంధువులు, ఆయన బృందంతో కలిసి ముందస్తు ప్రణాళికతో చేసిన హత్య అని సీబీఐ ఆ హత్య జరిగిన తర్వాత స్పష్టంగా పేర్కొంది. వాస్తవానికి సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ వైఎస్ అవినాష్ రెడ్డి ని సీబీఐ అరెస్ట్ చేయలేకపోయింది, దీనికి కారణం ఏపీ పోలీసులు సహకరించకపోవడంతో రిక్తహస్తాలతో వెనుదిరగాల్సి వచ్చింది.
విజయసాయి రెడ్డి దర్యాప్తులను ఎలా తప్పుదారి పట్టించవచ్చో/సాక్షులను ఎలా బెదిరించవచ్చో మరియు అతని తప్పుడు రహస్యాలను ఎలా కొనసాగించవచ్చో మరియు దశాబ్దాలపాటు విచారణను ఎలా ఆలస్యం చేస్తారో పైన తెలిపిన అంశాలను పరిశీలిస్తే అర్ధం అవుతుంది.
10 ఏళ్లుగా మన వ్యవస్థలోని కొన్ని అవకాశాలను వినియోగించుకోయిని బెయిల్‌పై విజయసాయి రెడ్డి మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి వారు నేరాల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నందున ప్రజలు మన వ్యవస్థలపై విశ్వాసం కోల్పోతున్నారు.
మీ దయతో కూడిన జోక్యం కోసం అభ్యర్థిస్తున్నాను మరియు వీరి బెయిల్‌ను తక్షణమే రద్దు చేయడం ద్వారా వచ్చే 6 నెలల్లో ఈ కేసులన్నింటినీ ఒక కొలిక్కి తెచ్చి దోషులని తేలిన వారిపైన న్యాయపరమైన చర్యలు చేపట్టాలని, ఆంధ్రప్రదేశ్ పౌరులకు మరింత హాని జరగకుండా నిరోధించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని మరియు న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని కాపాడండి.
మీ దయ కోసం ఎదురు చూస్తున్నాను. సకాలంలో సరైన న్యాయం అందించడంలో మీరు సహాయం చేయగలిగితే చాలా కృతజ్ఞతలు.
ధన్యవాదాలు.
ఎన్‌క్లోజర్స్ :
1) విజయ సాయి రెడ్డికి సంబంధించిన అన్ని కేసు వివరాలు.
2) ఏపీ మద్యం కుంభకోణంపై కేంద్ర హోంమంత్రికి లేఖ.
3) అక్రమ ఇసుక తవ్వకాలపై ఐటీ కమీషనర్‌కు లేఖ
3)శ్రీ వివేకానంద హత్యపై విచారణను తప్పుదారి పట్టించేలా ఆయన ఉద్దేశపూర్వక ప్రసంగం.
4) నేను బహిరంగంగా కనిపించకుండా ఉండేలా అతని ప్రసంగం నన్ను బెదిరించింది.
5) విశాఖపట్నంలో అతని భూ కుంభకోణాలపై పత్రికా కథనాలు
మీ
శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి
ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు.
తేదీ : 4 నవంబర్ 2023