కేంద్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు కేటాయించిన నిధులను వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టించి, దుర్వినియోగానికి పాల్పడటంపై బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తం గా పిలుపునిచ్చింది . ఇక తిరుపతిలో బీజేపీ మహాధర్నాలో జనసేన నేతలు కూడా పాల్గొన్నారు. మొట్ట మొదటిసారి బీజేపీతో కలిసి నిరసనలో జనసేన పాల్గొంంది. ఈ రోజు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితోపాటు, ఉభయ పార్టీల నేతలు తిరుపతి RDO office ఎదుట నిరసన చేస్తూ రాస్తారోకో చేసేందుకు వారు ప్రయత్నించగా, అడ్డుకున్న పోలీసులు నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లోనే నేతలు ధర్నాను కొనసాగిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్‌తో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన సహా మరో 40 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా జగన్ మార్చారంటూ భాజాపా అధ్యక్షురాలు పురందేశ్వరి ఫైర్ అయ్యారు . ఒంగోలు కలెక్టరేట్ వద్ద బీజేపీ తలపెట్టిన మహాధర్నాలో పురందేశ్వరి స్వయం గా పాల్గొన్నారు.ఈ ప్రభుత్వంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా చేసిన పనులకు నిధులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ ఆత్మహత్య ల పాపం జగన్మోహన్ రెడ్డి ది కాదా అంటూ రాజ్యాంగ బద్దమైన సర్పంచ్ వ్యవస్థని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తం గా అనేక చోట్ల కలెక్టరేట్ల ఎదుట జనసేన భాజా నేతలు కలసి ధర్నా చేశారు .