Khmmam: రెండు తెలుగు రాష్ట్రాల్లో అరాచక పాలన కొనసాగుతోందని, ఇలాంటి అవినీతి, నిర్బంధ పాలన తన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చూడలేదన్నారు కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే ఎన్నడూ ప్రతీకారాలను చూడలేదన్నారు. విపక్షాలను , ప్రజలను బెదిరించి అన్నివేళలా రాజకీయాలు చేయలేరని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Mahaboobnagar: పాలమూరు ప్రజాభేరి పేరుతొ భారీ బహిరంగ సభను ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ లో ఈ నెల 31 న జరపనుంది . 31న సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా పై పట్టుకోసం కాంగ్రెస్ దృష్టి సారించింది .
Nalgonda: నల్గొండ జిల్లా పై తెలంగాణ కాంగ్రెస్ పట్టు బిగించింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ 50 వేల మెజారిటీ తో హుజుర్ నగర్ లో గెలుస్తా అని ధీమా వ్యక్తం చేశారు . తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ ఋణం తీర్చుకోవాలి అన్నారు . రాబోయే ఎన్నికల్లో రాష్ట్రం లో 75 స్థానాలు పక్కా అన్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి .
Tirumala: నా భర్త చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లా.. .ఈ ప్రయాణం భారంగా ఉంది. దేవుడి దయతో నిజం గెలుస్తుంది అని నమ్ముతున్నా. ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే నేను.. ఆయన జైల్లో ఉన్న కారణంగా ఈరోజు ఒంటరిగా నారావారిపల్లె వెళ్ళాను. ఈ ప్రయాణం నాకు ఎంతో బాధ కలిగించింది. ప్రతి నిమిషం భారంగా గడిచింది. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని నమ్ముతున్నాను. దీనిలో భాగంగా చంద్రగిరిలో రేపు తొలి అడుగు వేస్తున్నాను.” అని నారా భువనేశ్వరి అన్నారు.
Guntur: ఫాం 7’ని అడ్డుపెట్టుకుని అర్హులైన ఓటర్లను తొలగించడంలో అధికార పక్షానికి సహకరిస్తున్న కొందరు అధికారులు, పోలీసులు ఎట్టకేలకు భారీగానే మూల్యం చెల్లించుకొంటున్నారు. పోలీసు శాఖలో పనిచేస్తున్న నలుగురు అధికారులు తాజాగా వేటుకు గురయ్యారు. పర్చూరు నియోజకవర్గ పరిధిలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పరిధి దాటి వ్యవహరించిన వారిలో ఓ సీఐ, ముగ్గురు ఎస్‌ఐలను వీఆర్‌కు పంపిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
Hyderabad: చంద్రబాబునాయుడు అరెస్టుపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అసలు పనితనం లేదు.. కేవలం పగతనం మాత్రమే ఉంది అంటూ హరీష్ రావు సెటైర్లు వేశారు. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా కేసీఆర్ పగబడితే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జైలులో ఉండేవారని.. కానీ తాము ఎవరి మీదా పగ పట్టమని, అలాగే ఎవరి మీద అకారణమైన ద్వేషాన్ని పెంచుకోమని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
Chandragiri: ‘నిజం గెలవాలి’ పేరుతో నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి.. నేటి నుంచి ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి ధైర్యం చెప్పడంతో పాటు వారికి అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వనున్నారు. బాబుకు మద్దతుగా రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలపనున్నారు. రాయలసీమ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు రోజుల పాటు సాగనుంది. ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
రాజమండ్రి : సోమవారం (అక్టోబర్ 23) జరిగిన లోకేష్, పవన్ భేటీ అధికార వైసీపీలో అలజడి పెరిగి, వెన్నులో వణుకు, భయం మొదలైంది. ఇప్పటికే పలు సర్వేల ఫలితాలను, ప్రజల అసంతృప్తిని, ఆగ్రహాన్నీ చవి చూసిన వైకాపా నేతలకు తెలుగుదేశం , జనసేన ఉమ్మడి కార్యాచరణ మరింత భయాందోళనలకు గురి చేస్తున్నది. పైకి మేకపోతు గాంభీర్యం పదర్శిస్తున్నా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహా.. వైసీపీ పెద్దలను కూడా తెలుగుదేశం, జనసేన పొత్తు కలవరపెడుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
160 రోజుల్లో 160 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలన్న ప్లాన్-160పై లోతుగా చర్చించారు. రోడ్‌మ్యాప్ ఖరారు చేసిన నారా లోకేష్ , పవన్ కళ్యాణ్.
Vijayawada: అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని.. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు వినతి పత్రం ఇచిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి . ఏపీలో ఆర్థిక దుస్థితి, అప్పులు, ప్రజల భవిష్యత్తుపై భయంతో జూలై 26న సవివరమైన వినతిపత్రం అందించినప్పటికీ రాష్ట్రంలో ఏ మాత్రం మార్పు రాలేదని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో చేసిన అప్పుల జాబితాను ఆమె సవివరంగా పేర్కొంటూ ఓ లేఖను కేంద్ర మంత్రికి అందచేశారు. ‘‘రూ.10.77 లక్షల కోట్ల భారంపై మీ దృష్టికి తీసుకొస్తే వైసీపీ ఎంపీలకు పార్లమెంటులో మీరిచ్చిన 4.42 లక్షల కోట్లు (కేవలం ఆర్బీఐ అప్పు) చూపించి ప్రజల్ని మభ్యపెడుతూ, బీజేపీని టార్గెట్ చేస్తూ జగన్ సొంత మీడియా చెలరేగి పోతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ, అవకతవకలు, కార్పొరేషన్ల రుణాలు, ఆస్తులు తనఖా పెట్టి తెచ్చిన అప్పులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు ప్రతిదీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు పురంధరేశ్వరి.
New Delhi: న్యూఢిల్లీలోని ద్వారకలో మంగళవారం అత్యంత ఘనంగా జరిగిన దసరా వేడుకల్లో ప్రధాని చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అన్నారు . దేశ ప్రజలందరికీ నవరాత్రి, విజయదశమి శుక్షాకాంక్షలు తెలిపారు. రావణ దహనం అంటే కేవలం గడ్డిబొమ్మను దహనం చేయడం మాత్రమే కాదని, భరతమాతను కులం, ప్రాంతీయవాదం పేరుతో విడగొట్టాలని చూసే శక్తుల అంశం కూడా అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు . డవలప్డ్ ఇండియా దిశగా ప్రజలంతా 10 ప్రతినలు చేయాలని ప్రధాని కోరారు.