చిత్రం : అన్నపూర్ణ ఫోటో స్టూడియో
నటీనటులు: చైతన్య రావు, లావణ్య సాహుకార, లలిత్ ఆదిత్య, వివా రాఘవ, ఉత్తర రెడ్డి, మిహిర గురుపాదప్ప, యష్ రంగినేని, వాసు ఇంటూరి, కృష్ణ మోహన్, రమణ
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
సినిమాటోగ్రఫీ: పంకజ్ తొట్టాడ
ఎడిటర్: డి వెంకట్ ప్రభు
దర్శకుడు : చందు ముద్దు
నిర్మాత: యష్ రంగినేని
విడుదల : జూలై 21, 2023
రేటింగ్ : 2.75/5

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో (annapurna photo studio). ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ ఫొటో స్టూడియో చిత్రం విలేజ్ నేపథ్యం. 1980లో బెల్ బాటమ్ ఫాంట్ లు, ఓణీలు వేసుకునే స్వచ్ఛమైన మనుషుల కథ. ఇప్పటి పెద్దలు అప్పటి వాతావరణంలోకి తొంగి చూసే విధంగా ఉన్నటుంది అని దర్శక నిర్మాతలు చెబుతూ వచ్చారు. కొత్తవారితో దర్శక నిర్మాతలు చేసిన ఈ సినిమా జులై 21న అనగా ఈరోజే విడుద అయింది. ఆ సినిమా ఎలా వుందో చూద్దాం.
కథ:
చంటి(చైతన్య రావు) కపిలేశ్వరపురం అనే చిన్న గ్రామంలో ఓ వీడియోగ్రాఫర్ కాగా తన చిన్నపాటి జీవితాన్ని అయితే తన ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో అయితే సాఫీగా సాగిస్తుంటాడు. అయితే అక్కడ గౌతమి(లావణ్య సాహుకార) ని చూసి చంటి ప్రేమిస్తాడు. తరువాత ఆమె కూడా ప్రేమిస్తుంది. కానీ కొన్ని ఊహించని కారణాలతో అయితే చంటి ఆత్మహత్యా యత్నం చేస్తాడు. మరి తాను సడెన్ గా అలా చేసుకోడానికి కారణం ఏంటి? ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.
విశ్లేషణ:
30 వెడ్స్ 21 అనే వెబ్ సిరీస్ లో పౌపులర్ అయిన (చైతన్యరావ్ (chaitanya rao) ఇందులోనూ ఏజ్ తేడా ప్రేమ కథతో నటించాడు. 80వ దశంలో కథ కాబట్టి దానికి తగినట్లు చక్కటి గ్రామాన్ని ఎంపికచేసుకున్నాడు దర్శకుడు. గతంలో పెద్ద వంశీచిత్రాలు వచ్చాయి. గ్యాప్ చాలా వుండడంతో ఆ తరహాలో దర్శకుడు చెందు వెళ్ళాడు. ఇందులో హీరోకు వయస్సు వచ్చినా పెండ్లికాదు అనే పాయింట్ సరికొత్తగా అనిపిస్తుంది. అలా ఎందుకనేది ముగింపు దాకా తీసుకువచ్చి సస్పెన్స్‌లో పెట్టాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్ ఇస్తాయి. హీరోయిన్‌ను చూడగానే రంగమ్మ అనే సాంగ్ రావడం చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ అది పూర్తినిడివి సాంగ్‌లేకపోవడంతో కొంత ఆడియన్స్‌కు నిరాశ కలిగిస్తుంది. ఇద్దరూ కొత్తవారు కావడం అప్పుడే చిగురించిన పువ్వులా లావణ్య పాత్ర అందంగా వుంటుంది. వయస్సుమీద పడినా హీరో పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. వారి నటన స్వచ్చంగా వుంది. వారితోపాటు వారి స్నేహితులుకూడా బాగా నటించారు.
ఫైనల్ గా చెప్పాలంటే :
‘అన్నపూర్ణ ఫొటో స్టుడియో’ బ్రహ్మాండం.. అద్భుతం.. అమోఘం అని అనలేం కానీ.. ఓ మంచి చిత్రాన్ని చూసిన అనుభూతి అయితే మిస్ కారు. ఫ్యామిలీతో కాసేపు హాయిగా నవ్వుకోవచ్చు. లావణ్య రూపంలో మరో తెలుగు హీరోయిన్ దొరికినట్టే. తెలుగు పిల్ల చక్కగా ఉంది.