Friday, September 13, 2024
spot_img
HomeNewsAndhra Pradeshవైకాపా కు రాబోయే ఎన్నికల్లో శృంగభంగం ... ఎన్ని సీట్లు అంటే ....

వైకాపా కు రాబోయే ఎన్నికల్లో శృంగభంగం … ఎన్ని సీట్లు అంటే ….

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకేయం రాబోయే ఎన్నికల్లో ఏకపక్షం గా సాగే సూచనలు అనేకం కనిపిస్తున్నాయి . దీనికి ఉదాహరణే ప్రతిపక్షాల నాయకులకు ప్రజాదరణ స్పష్టం గా కనిపించడం . అది నారా లోకేష్ యువగళం పాదయాత్ర కానీ , జనసేనాని వారాహి యాత్ర కానీ ప్రజాదరణతో సాగుతున్న సంగతి తెలిసిందే . ఇక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సభలు జనసునామీ ని తలపిస్తున్నాయంటే ప్రజానాడి ని అర్ధం చేసుకోవచ్చు .

నిన్న వైసీపీ ఎంపీ RRR నిన్నటి రచ్చబండలో కొన్ని సర్వే ఏజెన్సీల ద్వారా వచ్చిన రిపోర్టులను వివరాలు సంచలనం గా మారాయి . వైసీపీ (YCP) పార్టీకి కష్టాలు తప్పేలా లేవని, లోక్ సభ ఎన్నికల్లో 4 లేక 5 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదన్నారు . ఆంధ్ర ప్రదేశ్ ఓటర్ మదిలో ఏముంది? అన్న మీడియీ ప్రశ్నకు సమాధానంగా శుక్రవారం ఆయన ఢిల్లీలో మాట్లాడారు . 2009లో కాంగ్రెస్ (Congress) విజయం సాధించిందని, అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్తా వైఎస్సార్సీపీగా మారింది . గతంలో కాంగ్రెస్ సంప్రదాయ ఓట్లు వైసీపీ కి మారాయి .. ఇప్పుడు ఆ విధమైన పరిస్థితి లేదన్నారు.

ముస్లిం మైనారిటీ లు , sc / st వర్గాలు , షర్మిల ప్రభావం ఇలా వైసీపీ కి 6 శాతం వరకూ ఓట్లు గండి పడే అవకాశం స్పష్టం గా ఉందన్నారు . వచ్చే ఎన్నికల్లో వైకాపా కు 40 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చే అవకాశం కనిపిస్తోందని, సజ్జల సయితం ఎన్నికలపై మాట్లాడడం లేదని రఘురామ తెలిపారు . రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష ఓటు చీలదని , అయితే పొత్తుల విషయం లో స్పష్టత కు మరికొంత సమయం పెట్టె అవకాశం ఉందని రెబెల్ వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

దీనిపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు . రాబోయే ఎన్నికలు ఏకపక్షం గా జరిగే అవకాశాలు ఉన్నట్లు జిల్లాల నుండీ రాజకీయ సమాచారం బట్టి అధికార వైసీపీ 20 లోపు స్థానాలకు పరిమితం అవుతుంది . ఇక 40 నుంచీ 45 స్థానాలు ఎక్కడ నుంచీ వస్తాయో వేచి చూడాల్సిందే !?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments