Saturday, August 13, 2022
spot_img
HomeNewsAndhra Pradeshరాష్టంలోనే తొలిసారిగా హ్యాండ్ అండ్ మైక్రోసర్జరీ

రాష్టంలోనే తొలిసారిగా హ్యాండ్ అండ్ మైక్రోసర్జరీ

ఆర్థోపెడిక్స్ లో విప్లవాత్మక వైద్యవిధానం .... 5వేలకు పైగా విజయవంతమైన శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ బిందెశ్ గుంటూరు లో ఏర్పాటు

వర్తమాన పరిస్థితులలో ఎముకలు, కీళ్ల శాస్త్ర విభాగంలో వైద్యానికి ఎంతో ప్రాధాన్యత వున్నది. వయసుతో నిమిత్తం లేకుండా 50 శాతం మందికి పైగా ఏదో ఒకరూపంలో ఎముకలు, కీళ్ళు కు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నట్టు పలు సర్వే లు స్పష్టం చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం లేకపోవటం వంటి పలు కారణాలు అందుకు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో వుంచుకొని మానవ శరీరంలోని ఎముకలు, కీళ్ల విభాగంపై నిరంతరం వైద్య పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. అందుకు అనుగుణంగా మన వైద్యులు అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. ఆ విభాగంలో నిరంతర పరిశోధనా క్రమంలో పుట్టుకొచ్చిందే ‘హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ’. ఎముకలు కీళ్ల కు సంబంధించిన చికిత్స, పునర్నిర్మాణ శస్త్రచికిత్స లు చేయటంలో ఈ ఆధునికవిధానం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిందని చెప్పవచ్చు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా హ్యాండ్ అండ్ మైక్రోసర్జరీ చికిత్సా విధానం గుంటూరు కేంద్రంగా అందుబాటులోకి రానున్నది. శరీరంలో ఏదైనా భాగానికి గాయం అయినప్పుడు అవయవాలతో పాటు, ప్రాణసంరక్షణ జరగాలంటే సకాలంలో వైద్యం అందాల్సివుంటుంది. ఆ క్రమంలో ఈ విధానం అత్యావశ్యకం అవుతున్నది. మధుమేహ పాదం అనేది ఎక్కువ సందర్భాలలో అవయవాలు దెబ్బతినేందుకు దారితీస్తుంది అని ప్రపంచవ్యాప్తంగా వైద్యుల అధ్యయనంలో వెళ్లదయింది. అటువంటి సందర్భాలలో ఈ హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ విధానం ఎంతగానో ఉపకరిస్తుంది.

హ్యాండ్ అండ్ మైక్రో సర్జన్ విభాగంలో సుశిక్షణ పొందిన డాక్టర్ బిందేష్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గుంటూరులో ఈ చికిత్సావిధానానికి శ్రీకారం చుట్టారు. ఆర్థోపెడిక్స్, పునర్నిర్మాణ శస్త్రచికిత్సా రంగంలో దశాబ్దకాలంపైగా అనుభవం గడించిన డాక్టర్ బిందేష్ హ్యాండ్ అండ్ మైక్రో సర్జరీ విధానంలో ఇప్పటివరకు దాదాపు 5 వేలకు పైగా శస్త్రచికిత్సలు నిర్వహించారు. అత్యధిక శాతం విజయాల నమోదుతో సంచలనం సృష్టించారు.

డాక్టర్ బిందేష్ ముంబై లోని ఎల్ టి ఏం జి కళాశాల నుంచి ఆర్థోపెడిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. కోయంబత్తూరు లోని సుప్రసిద్ధ గంగా హాస్పిటల్ లో డాక్టర్ రాజసభాపతి ఆధ్వర్యంలో ఆర్థోప్లాస్టిక్రీ కన్స్త్రాక్టివ్ మైక్రోసర్జరీ లో పాత్ బ్రేకింగ్ స్పెషలైజేషన్ పూర్తి చేశారు. అందుకు సంబంధించి పలు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు. ఓపెన్ ఫ్రాక్చర్ నరాల శస్త్రచికిత్స, మధుమేహ పాదం, వాస్కులార్ సర్జరీలు, తెగిపడిన అవయవాలను తిరిగి అమర్చడంలో డాక్టర్ బిందేష్ కు అపార అనుభవం వుంది.

కోస్తాజిల్లాలు అన్నింటికీ అందుబాటులో వుండే విధంగా గుంటూరు లో ఈ తరహా ఆసుపత్రిని మొట్టమొదటి సారిగా ప్రారంభించనున్నారు. అతితక్కువ ఖర్చుతో ఆధునిక వైద్యానికి సామాన్యులకు సైతం అందుబాటులో తీసుకురావాలనే తలంపుతో ఈ ఆసుపత్రి ప్రారంభిస్తున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments