[ad_1]

అలియా భట్, ట్రిపుల్ ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సీతగా పరిచయమైన ఈమె తాజాగా ‘బ్రహ్మాస్త్రం’లో ఈషా అలియాస్ పార్వతిగా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ‘గంగూబాయి కతీయవాడి’ సినిమాలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన ప్రియుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న అలియా త్వరలో తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే.
g-ప్రకటన
ప్రెగ్నన్సీ సమయంలో ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు కాస్త విరామం తీసుకుని ప్రెగ్నెన్సీని ఎంజాయ్ చేస్తున్న అలియా.. కపూర్ ఫ్యామిలీ కోసం బేబీ షవర్ వేడుకను నిర్వహించింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రణబీర్ కపూర్, అలియాల రొమాంటిక్ ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
మీరు కూడా చూడండి:
[ad_2]