Saturday, December 21, 2024
spot_img
HomeElections 2023-2024అచ్చంపేట (SC) అసెంబ్లీ లో ఎగిరేది యే జెండా !? TELANGANA ASSEMBLY 2023

అచ్చంపేట (SC) అసెంబ్లీ లో ఎగిరేది యే జెండా !? TELANGANA ASSEMBLY 2023

Mahaboobnagar: నవంబర్ 30 న జరగనున్నతెలంగాణ శాసనసభ ఎన్నికలు ఈ దఫా కురుక్షేత్ర యుద్దాన్ని తలపించే బోతున్నాయి . ఇప్పటికే భారత్ 117 స్థానాలకు , కాంగ్రెస్ 55 స్థానాలకు , భాజాపా 52 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించాయి . ఈ సారి ఎన్నికలు సుమారు 75 నుంచీ 80 స్థానాల్లో పోటీ కాంగ్రెస్ భారాసా ల మధ్యే జరగనుంది. నేడు కెసిఆర్ ప్రజా ఆశీర్వాదసభల్లో భాగం గా అచ్చంపేట లో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు .

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో భారాసా కు ఎదురు దెబ్బలు తప్పడం లేదు . అచ్చం పేట అసెంబ్లీ స్థానం లో భారాసా అభ్యర్థి గువ్వల బాలరాజు హ్యాట్రిక్ విజయం కోసం చేతున్న ప్రయత్నాలు ఫలించడం లేదు . గువ్వల మాట తీరు పట్ల తీవ్ర అభ్యంతరాలు పలువురు సీనియర్ నాయకులు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే . స్థానిక ఎంపీ రాములు గువ్వల ప్రచారమ్ లో చురుకుగా పాల్గొనడం లేదు . దీనికి ప్రధాన కారణం ఆయన కొడుకు కల్వకుర్తి జడ్పీటీసీ భరత్ ప్రసాద్ . ఆయనను అచ్చంపేట లో తిరగకుండా కేటీర్ తో చెప్పి కట్టడి చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి .

SC లు 26% ST లు 23% యాదవులు : 12% ముదిరాజ్ : 10% గౌడ్ : 8 % పద్మశాలి : 7%

ముస్లిం : 6% రెడ్డి : 5%

ఇక అచ్చంపేట లో కారుపార్టీ లో ఉక్కపోత కు గురై సర్పంచులు , ఎంపీటీసీ లు , జడ్పీటీసీ లు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గూటికి చేరడం మొదలైంది . ఇప్పటికే ఠాకూర్ బాలాజీ సింగ్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు . ఆయనే చక్రం తిప్పి అచ్చంపేట , ఉప్పునూతల జడ్పీటీసీ లు ఐన మాంత్రియా నాయక్ , అనంత ప్రతాప్ రెడ్డి లను హస్తం గూటికి చేర్చారు . ప్రభుత్వ వ్యతిరేకత తో పాటు స్థానిక అభ్యర్థి పై వ్యతిరేకత తో వారి వ్యవహారశైలి కొంప ముంచుతాయనే భయం భారాసా నాయకత్వం లో ప్రబలింది .

కారు దిగిన నేతలలో అచ్చంపేట వైస్ ఎంపీపీ అమరావతి , మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సీఎం రెడ్డి , అచ్చంపేట మునిసిపల్ కౌన్సిలర్స్ రాములు , లావణ్య వెంకటేష్ , రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్ , ఉప్పునూతల ఎంపీపీ అరుణ రెడ్డి , ఎంపీటీసీ కవితా రెడ్డి , సర్పంచులు వున్నారు .

అచ్చంపేట sc reserved నియోజకవర్గం లో 2.2 లక్షల ఓటర్లు వున్నారు . గత ఎన్నికల్లో తీవ్రమైన పోటీ మధ్య కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ పై కేవలం 9500 ఓట్ల మెజారిటీ తో గువ్వల బాలరాజు గెలవడం జరిగింది. 3 పర్యాయాలు స్వల్ప తేడాతో ఓడిన వంశీకృష్ణ పై నియోజక వర్గంలో సానుభూతి పెరిగింది. డాక్టర్ గా విశేష సేవలు అందిస్తున్న వంశీ కృష్ణ , ఈ సానుభూతిని ఓట్లుగా మార్చుకొంటారో లేదో వేచి చూడాలి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments