తెలంగాణాలో జరిగిన త్రిముఖపోరులో ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయంతో మళ్లీ అధికారంలోకి వస్తామనే అతి ధీమాతోనే, నాటి అధికార పార్టీ వ్యవహరించిన తీరు వళ్ళ బిఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు చేసిన తప్పులే వారిని ఇప్పుడు ఇరకాటంలో పడేస్తున్నట్లు కనిపిస్తుంది. ఐతే ఇదే క్రమంలో తెలంగాణలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే టార్గెట్ గా బారాసా, బాజాపా పొత్తు పెట్టుకుంటాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలో బీఆర్ఎస్, బీజేపీల పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాటలు వింటుంటే బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ, ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చేలా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని సంచలన ఆరోపణలు గుప్పించారు. బీజేపీ బలంగా లేని చోట ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకుంటుందన్నారు. లిక్కర్ కేసు లాంటి అవినీతి కేసుల నుండి కాపాడినందుకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ కృతజ్ఞత చూపనుందని సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు సెంట్రల్‌లో పవర్‌లో ఉన్న బీజేపీ గూటికీ చేరాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లు పొలిటికల్ సర్కి్ల్స్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్‌తో పొత్తు వార్తలపై ఇప్పటికే టీ బీజేపీ లీడర్స్ స్పందించారు. స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్‌లు బీఆర్ఎస్‌తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కానీ పొత్తు లేదు లేదంటున్నా ప్రచారం మాత్రం ఆగట్లేదు ఇప్పుడు లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీ బిఆర్ఎస్ పొత్తు పై అద్దంకి పెట్టిన వీడియో
సోషల్ మీడియాలో దుమారంరేపుతోంది.