బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. సీఎం రేవంత్‌కు కేటీఆర్ విసిరిన ఛాలెంజ్‌కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి మీడియా ప్రతినిధులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాట్లాడుతు ‘‘నేను నా నియోజక వర్గం నల్లగొండలో రాజీనామా చేస్తా.. కేటీఆర్ నువ్వు సిరిసిల్లలో రాజీనామా చెయ్యి . ఇద్దరం కలిసి సిరిసిల్ల నుండి పోటీ చేద్దాం. కేటీఆర్ ని సొంత నియోజక వర్గం సిరిసిల్లలో నేను గెలుస్తా. సిరిసిల్లలో కనుక కేటీఆర్‌పై పోటీ చేసి నేను ఓడిపోతే రాజీయాలకు దూరంగా ఉంటా. ఒకవేళ కేటీఆర్ నా పై ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉంటావా ..? కేటీఆర్ ఓడిపోతే బిఆర్ స్ పార్టీ మూసేస్తా అని కేసీఆర్ ప్రకటన చేస్తారా..?’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు.
సిరిసిల్లలో నేను గెలుస్తే ఇక మీరు కారు షెడ్డు మూసేసుకోవాలి అని ఎద్దేవా చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . కేటీఆర్ ఒక చిన్న పిల్లోడు , అతడనికి టెక్నీకల్గ నాలెడ్జ్ లేదని సెటైర్ వేశారు. నా స్థాయి కేటీఆర్‌ది కాదని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . కేటీఆర్‌కు క్యారెక్టర్ ఏ లేదని… లక్షల కోట్లు మాత్రమే ఉన్నాయని విమర్శించారు. నాకు క్యారెక్టర్ ఉంది కానీ నా దగ్గర డబ్బులు లేవనిఅన్నారు . కేటీఆర్ సిరిసిల్లలో వందల కోట్లు ఖర్చు చేసి కేవలం 30 వేల మెజార్టీతో గెలుస్తాడా.. నేను కనుక అలా గెలిస్తే రాజీనామా చేసేవాడిని అని కీలక వ్యాఖ్యలు చేశారు.