బిఆర్ఎస్ “చలో మేడిగడ్డ” సందర్శనకు ముందే
అసలు నిజాన్ని బయటపెట్టిన కాంగ్రెస్..?
తెలంగాణ భవన్ నుంచి 150 మంది ప్రజాప్రతినిధుతో మెడిగడ్డ బ్యారేజీకి బయల్దేరుతామన్నారు కేటీఆర్. మేడిగడ్డపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండగడతామన్నారు. మార్చి 1న తలపెట్టిన “చలో మేడిగడ్డ” పేరుతో ప్రాజెక్టుల సందర్శనకు తమ వెంట కాంగ్రెస్ మంత్రులను తీసుకెళ్తామని.. కాళేశ్వరం ఫలాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు అందరం కలిసి వెళతామని మాజీ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. పబ్లిక్ కు కాళేశ్వరం తప్పు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు వాస్తవం చూపించేందుకు కాళేశ్వరం వెళ్లబోతున్నామని తెలిపారు. ఐతే ఇదే క్రమంలో నేడు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బారాసా జిమ్మిక్కులను మోసాలను బయటపెట్టారు.
కమీషన్ల కోసం ప్రాజెక్టులు గత ప్రభుత్వంలో కట్టారు. ఇంకా ప్రాజెక్టు పూర్తి కావడానికి 1 లక్ష 47వేల కోట్లు కావాలి. కాళేశ్వరంలో 25వేల కోట్ల పనులు ఎలాంటి DPR లేకుండా పనులు అలాట్ చేశారు. 94 వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం ఖర్చు. 5 ఏళ్లలో 160 టీఎంసీ నీళ్లను మాత్రమే లిఫ్ట్ చేశారు అని ఆడరాల్తో సభ కాంగ్రెస్ బయటపెట్టింది. ఇరిగేషన్ కోసం ఉపయోగించింది 65 టీఎంసిలు మాత్రమే. ప్రతీ ఏటా కాళేశ్వరం నుంచి 6లక్షల 50వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చారు. BRS తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి జిమ్మకులు చేస్తున్నారు అని కాంగ్రెస్ మంత్రులు హెద్దేవా చేస్తున్నారు. గతంలోనే బారసాల నేతలకు మేడిగడ్డ సందర్శనకు ఆహ్వానించినా వారు రాకపోవటంతో, మళ్ళీ మార్చి 1న కాళేశ్వరం సందర్శనకు వెళ్ళటం చూస్తుంటే జాలేస్తుందని సీఎం రేవంత్ వెల్లడించారు.
BRS నేతలు మేడిగడ్డ పై నిజాలు చెప్పకుండా తప్పులు ప్రచారం చేస్తున్నారు. మేడిగడ్డను NDSA కు అప్పగించాము. NDSA నివేదిక ఆధారంగా భవిషత్ చర్యలు ఉంటాయి. BRS లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ను నిషేధిత ప్రాంతంగా మేము పెట్టలేదు. BRS నేతలతో పాటు కేసీఆర్ వెళ్లి చూసి రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. BRS నేతలకు కాళేశ్వరం చూపించాలని అధికారులకు మేము ఆదేశించాము. బీఆర్ఎస్ నాయకులు వేలకోట్లు దోచుకొని, ఫ్రాడ్ చేసి మేమేదో తప్పు చేసినట్లు మమ్ములను విమర్శిస్తున్నారని మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తాడు. రైతన్నా మేలుకో.. మేడిగడ్డను కాపాడుకో! మేడిగడ్డ కాళేశ్వరం డొల్ల పై బారాసా మేధావులు చేస్తున్న హంగామా వెనుక అనేక అసలు నిజానిజాలు.