నీ బిడ్డలకు మాత్రం పదవులు ఇచ్చినవ్ బారాసా అధినేత కెసిఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం
కేటీఆర్ నువ్వు మొనగాడివైతే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిపించి చూపించు
మాకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అవసరం లేదు.. నీ ట్యూబ్ పగలకొట్టడమే నా కర్తవ్యమ్
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే లాగులు ఊడదీసి కొడతా
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడే నిజమైన విజయం
సోనియమ్మ మాటంటే మాటే
వచ్చే నెల 2న మరో 6వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలోనే మెగా డీఎస్సీ సీఎం రేవంత్
కార్యకర్తల కష్టం త్యాగంతోనే కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది
గుజరాత్ మోడల్ అంటే మీ ఉద్దేశ్యం ప్రభుత్వాలను పడగొట్టటమేనా
చేవెళ్ల బారి బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ఓసన్నాసి అంటుండు .. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు కూడా రాకుండే అని.. ఈ చేవెళ్ల సభ నుంచి కేటీఆర్ కు నేను సవాల్ విసురుతున్నా,నీకు చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోనివే అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిపించి చూపించు .నువ్వొస్తవో.. నీ అయ్య వస్తడో.. మా కాంగ్రెస్ కార్యకర్తలు చూసుకుంటారు. మేం అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూసోలే. కింది స్థాయి నుంచి కార్యకర్తగా పార్టీకి కాపలా కాసి ,జెండాలు మోసి, లాఠీ దెబ్బలు తిని, మీరు పెట్టిన అక్రమ కేసులు ఎదుర్కొని, జైల్లో కూర్చుని మగ్గిన , నీఅయ్యను ,నిన్ను ,నీ బావను బొందబెట్టి డి అంటే డి అని ఇయ్యాల గ సీఎం కుర్చీలో కూసున్న.ఆ కుర్చీ మా కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం. నీ అయ్య నువ్వు ,ని బావ ,ఆఖరుకి మీ కల్వకుంట్ల కుటుంబమే వచ్చినా ఆకుర్చీని తాకలేరు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు .
నీ బిడ్డలకు ఉద్యోగాలు లేకుంటే నీకు ఏడుపొచ్చింది . ఉన్నఫళంగా వారికి కొలువులు కట్టబెట్టినవ్.. అది సరే మరి పదేళ్లుగా ,ఉద్యోగాలు లేకుండా పెళ్లి కాకుండా,పేద వారి బిడ్డలు రోడ్లమీద వీధుల వెంట తిరుగుతూ కూలి నాలి చెయ్యలేక చెట్లకు ఉరేసుకుని చస్తుంటే, ఏ ఒక్క రోజైనా ఒక్క గంట అయినా ,ఆ పేద పిల్లల గురించి ఆలోచించినవా కెసిఆర్‌ను.కెసిఆర్ అసలు నువ్వు మనిషివా..? మానవ రూపంలో ఉన్న మృగానివా? కేసీఆర్.. మేము అధికారంలోకి వచ్చి రాగానే 25 వేల మందికి నియామకపత్రాలు ఇచ్చినం . మార్చి 2నమరోఆరు వేల ఉద్యోగాలు ఇస్తున్నాం . గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాము . తొందర్లోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
సోనియమ్మ మాటిస్తే అది శాసనం శిలా శాసనం అని వెనక్కి తగ్గరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని మాటిచ్చిన సోనియమ్మ .తెలంగాణ ఇచ్చి ,ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నిబద్ధత సోనియా సొంతమని చెప్పారు .గతేడాది సెప్టెంబరు 17న తుక్కుగూ డలో సోనియమ్మ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను తప్పకుండ అమలు చేస్తాము అని సీఎం రేవంత్ చెప్పారు .

నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత గ్యాస్ సిలిండర్ 400 రూపాయల నుంచి మూడురెట్లు పెరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధర వలన మహిళల పై పడే కుటుంబ భారాన్ని తగ్గించేందుకు సబ్సిడీ ఇవ్వాలన్న జ్ఞానం కూడా లేకపోయే.పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళ తీసిందని, గవర్నమెంట్ ఉద్యోగులకు సైతం జీతాలను సకాలంలో సక్రమంగా ఇవ్వలేనంత ఘోరంగా ఉన్నదన్నారు. అయినా దుబారాను అరికట్టి , ఆర్థిక నియంత్రణ పాటిస్తూ అభివృద్ధి ,సంక్షేమాన్ని , రెండు కళ్లుగా చూసుకుంటూ ఎన్నికల హామీల్లో భాగముగా ఇచ్చిన 6 గ్యారెంటీలకు నిధులి సమకూరుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.