అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్ డుమ్మా ?
అసెంబ్లీ కి డుమ్మా కొట్టినా..
కెసిఆర్ ని వదలని సీఎం రేవంత్ సాబ్ ..?
తొలి రోజే అసెంబ్లీ కి కెసిఆర్ డుమ్మా..
కేసీఆర్ అసెంబ్లీకి రావాల్సిందే..! సీఎం రేవంత్ ఆర్డర్..
అసెంబ్లీ కి డుమ్మా కొట్టినా..
కెసిఆర్ ని వదలని సీఎం రేవంత్ ..?
కెసిఆర్ ని వెంటాడుతున్న సీఎం రేవంత్ సాబ్
గులాబీ దళపతి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .
డిసెంబర్లో జరిగిన గత అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్ డుమ్మా కొట్టారు అని మీ అందరికి తెలిసినదే ,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తముగా కాంగ్రెస్ గాలి వీచిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది .
ప్రజలచేత ప్రజలకై ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత డిసెంబర్లో మూడో అసెంబ్లీ తొలి సమావేశాలు నిర్వహించారు. 6 రోజులపాటు ఈ సమావేశాలు జరిగిన కేసీఆర్ తుంటికి ఆపరేషన్ జరగటంతో హాజరు కాలేకపోయారు .
ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ రంగం, కాళేశ్వరం ,మెడిగాడ్డ , మిషన్ భగీరథ, ఆర్థిక పర అంశాలపై చర్చలు నిర్వహించినా కెసిఆర్ పాల్గొన లేకపోయారు.
అయితే నేడు జరుగుతున్న అసెబ్లీ సమావేశాలకు గులాబీ దళపతి కెసిఆర్ వస్తున్నారా లేక డుమ్మాకొడుతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి .
బారాసా అధినేత కెసిఆర్ అసెంబ్లీకి వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ రచ్చ రచ్చ అవుంతుందేమో అనే భయం కెసిఆర్ కు వెనువెంటే ఉంది అని ప్రచారం జరుగుతుంది .
కాళేశ్వరం ప్రాజెక్ట్ ,మెడిగాడ్డ బ్యారేజి , మిషన్ భగీరథ, ఆర్థిక పర అంశాలు ,పలు సంస్థల నుంచి తెచ్చిన అప్పులు , విద్యుత్, జలాల వివాదం , విద్య, వైద్యం ఇలా ఒక్కటి ఏమిటి అన్నిరంగాలపై బారసా ప్రభుతం అవినీతిలో కూరుకుపోయి ఉంది , గులాబీ దళపతి అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి టీం అసెంబ్లీలో సాక్ష్యాలతో సహా బయట పెట్టే అవకాశం ఉంది.
అసెంబ్లీలో చర్చ జరగాలని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
ఇక్కడ చెప్పుకోవలసిన ప్రధానమైన అంశం ఏమిటంటే కొత్తగా తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ కన్నా BRS పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులుఏ అసెబ్లీలో చర్చ జరగాలి అని ఎక్కువగా కోరుకుంటున్నట్లు సమాచారం .
పదేళ్ల మా కెసిఆర్ సార్ పరిపాలనలో రాష్ట్ర దశ దిశా మార్చారు వారు ఏ తప్పు చెయ్యలేదు అభివృద్ధి మాత్రమే చేసారు ,ఏ తప్పు చెయ్యని మా గులాబీ దళపతి అసెబ్లీకి వస్తారు అని BRS అబిమానులు కార్యాకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు .
ఆలా అయితే ఏ తప్పు చేయకపోతే అసెబ్లీ సమావేశాలకు చర్చల్లో పాల్గొనాలి అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు కోరుకుంటున్నారు .
కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని, ప్రతిపక్ష నేతగా వారు వారి బాధ్యతలను నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పటం తెలంగాణ ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది .
ఈ నెల 10,12,13 తేదీల్లో బడ్జెట్పై అసెబ్లీలో చర్చ జరగనుండడంతో కెసిఆర్ హాజరవుతారా? లేదా? అనేదానిపై సరి అయినా స్పష్టత లేదు.
కానీ అందరు అనుకున్నట్లుగానే అసెబ్లీ సమావేశాలకు కెసిఆర్ డుమ్మా కొడుతున్నారు అని సమాచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ,
ఈ నెల 13న నల్లగొండలో బారి బహిరంగ సభ నిర్వహిస్తున్నాము ఆ సభలో గులాబీ దళపతి కెసిఆర్ పాల్గొంటున్నారు అని బీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి సమాచారం . అందువలన కెసిఆర్ ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనే అవకాశం లేదంటున్న బారాసా పార్టీ వర్గాలు.
కానీ ఇవి అన్ని తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి సాబ్ కెసిఆర్ అసెంబ్లీకి రావలసిందే అని ఆర్డర్ పాస్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం