17 నియోజకవర్గాల ఎంపీల షార్ట్ లిస్ట్
ఎంపీ టికెట్ వరించే గెలుపు గుర్రాలు వీరే
అతి సమీపంలో పార్లమెంటు ఎన్నికలు వస్తున్నా సమయంలో ఎంపీ అభ్యర్థుల జాబితాపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు కసరత్తును ప్రారంభించింది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్లో PEC ముఖ్య సమావేశం జరుగుతున్నది. భారీగా MP అభ్యర్థుల దరఖాస్తులు రాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు గుర్తు చేసుకుంటూ ,వచ్చిన జాబితాను షార్ట్ లిస్ట్ చేయనున్నారు ,నేడు PEC ముఖ్య సమావేశానికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపా దాస్, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు మొత్తం 309 అప్లికేషన్లు వచ్చినట్లు గాంధీభవన్ లోని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అత్యధికంగా మహబుబాబాద్ పార్లమెంట్ స్థానానికి 48, వరంగల్ ఎంపీ సీటుకు 42, పెద్దపల్లి MP సీటుకు 29, భువనగిరి MP సీటుకు 28, నాగర్కర్నూల్ MP సీటుకు 26 అప్లికేషన్లు వచ్చాయి. అత్యల్పంగా మహబూబ్నగర్కు నలుగురు అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేశారు.అభ్యర్థులు వివరాలు పరిశీలిస్తే
- వరంగల్ (ఎస్సీ)
సర్వే సత్యనారాయణ
మోత్కుపల్లి నర్సింహులు
సిరిసిల్ల రాజయ్య - నాగర్ కర్నూల్ (ఎస్సీ)
సంపత్ కుమార్
మల్లు రవి
చారకొండ వెంకటేశ్ - ఆదిలాబాద్ (ఎస్టీ)
నరేశ్ జాదవ్
సేవాలాల్ రాథోడ్ - మహబూబాబాద్ (ఎస్టీ)
బలరాం నాయక్
బెల్లయ్య నాయక్
విజయా బాయి - ఖమ్మం (జనరల్)
సోనియా గాంధీ
రేణుక చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి ,వీహెచ్ ,మల్లు నందిని ,వి.రాజేంద్ర ప్రసాద్ - హైదరాబాద్ (జనరల్)
సమీర్ ఉల్లా
సూరం దినేశ్
ఆనంద్ రావు
(పొత్తులో ఎంబీటీకి ఇచ్చే చాన్స్) - కరీంనగర్ (జనరల్)
ప్రవీణ్ రెడ్డి
రుద్ర సంతోశ్ కుమార్
నేరెళ్ల శారద
కటకం మృత్యుంజయం - పెద్దపల్లి (ఎస్సీ)
గడ్డం వంశీ
పెర్క శ్యామ్
రామిళ్ళ రాధిక - నిజామాబాద్ (జనరల్)
ఈరవత్రి అనిల్
జీవన్ రెడ్డి (ఎమ్మెల్సీ)
సునీల్ రెడ్డి (ఆరెంజ్ ట్రావెల్స్) - మెదక్ (జనరల్)
జగ్గారెడ్డి
మైనంపల్లి హన్మంత్ రావు
భవాని రెడ్డి
బండారు శ్రీకాంత్ రావు - జహీరాబాద్ (జనరల్)
సురేష్ షెట్కార
త్రిష (మంత్రి దామోదర కుమార్తె) - మల్కాజిగిరి (జనరల్)
బండ్ల గణేశ్
హరివర్ధన్ రెడ్డి
సర్వే సత్యనారాయణ - సికింద్రాబాద్ (జనరల్)
సీఏ వేణుగోపాల్ స్వామి
డాక్టర్ రవీందర్ గౌడ్
డాక్టర్ గడల శ్రీనివాసరావు
విద్యా స్రవంతి
అనిల్ కుమార్ యాదవ్ - చేవెళ్ల (జనరల్)
పారిజాత నర్సింహా రెడ్డి
దామోదర్ అవేలీ
KLR
మల్ రెడ్డి రామిరెడ్డి - మహబూబ్ నగర్ (జనరల్)
వంశీ చంద్ రెడ్డి
జీవన్ రెడ్డి (ఎంఎస్ఎన్ ఫార్మా)
జిల్లెల ఆదిత్య రెడ్డి
సీతా దయాకర్ రెడ్డి - నల్లగొండ (జనరల్)
జానారెడ్డి
రఘువీర్ రెడ్డి (జానారెడ్డి కుమారుడు)
పటేల్ రమేశ్ రెడ్డి - భువనగిరి (జనరల్)
చామల కిరణ్ కుమార్ రెడ్డి
తీన్మార్ మల్లన్న
కైలాశ్ నేత
కీర్తి రెడ్డి
సూర్య పవన్ రెడ్డి
వీరిలో గెలిచే గెలుపు గుర్రాలు ఎవరో ఎవరిని ఎంపీ టికెట్ వరిస్తుందో వేచి చూడాల్సిందే