Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshఅనంతపురం జిల్లాలో ఈసారి తెదేపాకు 14 కు 14 సీట్లు... నారా చంద్రబాబు !?

అనంతపురం జిల్లాలో ఈసారి తెదేపాకు 14 కు 14 సీట్లు… నారా చంద్రబాబు !?

Rayadurgam: Anathapuram: బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం లో భారీ భహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు . ముందస్తు ఎన్నికలు వస్తాయంటున్నారని, జమిలి ఎన్నికలు రావచ్చని, ఒక వేళ అది జరిగితే సైకోలాంటి జగన్ పాలన పీడా ముందుగానే విరుగడ అవుతుందని చంద్రబాబు అన్నారు . తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈసారి 14 కు 14 సీట్లు గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. Ex minister Kalva Srinivas also adressed meeting.

రాయదుర్గం సాక్షిగా వైసీపీని భూ స్థాపితం చేద్దామని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు . జగన్ ఇక ఇంటికి వెళతారని, ఆయన ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరుతూ గతంలో ఓట్లు వేయించుకున్నారని అన్నారు. ఇటువంటి పాలన అందిస్తారని ముందే తెలిస్తే ఆయనకు ప్రజలు ఆ ఒక్క చాన్స్ ఇచ్చేవారు కాదని చెప్పారు.

మొరుగుతున్న కుక్కలకి చెప్తున్నా, దిక్కున్న చోట చెప్పుకో, ఏమి చేస్తావో చేసుకో… అర్ధమైందా సైకో ?

ప్రజల జీవితాలు బాగుంటే తాను ఏపీలో తిరగాల్సిన అవసరం ఉండదని చంద్రబాబు అన్నారు. అంతేగానీ, తనకు రాజకీయాలు అవసరంలేదని చెప్పారు. ఉన్మాదుల పాలన కొనసాగుతోందని అన్నారు. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టనప్పుడు, మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెడుతున్నారని చంద్రబాబు నిలదీశారు. ఈ బహిరంగ సభకు జనం పోటెత్తారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments