(1919 లో భారత దేశం . బ్రిటిష్ పాలన లో వుంది : అప్పటి పురుషాధిక్య సమాజం లో భారత స్త్రీ లకు అతి తక్కువ హక్కులు ఉండేవి. )
( 2019 నాటి భారత దేశంలో స్త్రీలు పురుషులతో భుజం భుజం కలిపి నడుస్తారు. వారి సామర్థ్యం ఆధారంగా, భారతీయ మహిళలు దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా తమ గుర్తింపును తెచ్చుకున్నారు. భారతీయ మహిళలు క్రీడల నుండి వినోద ప్రపంచం వరకు మరియు వ్యాపారం నుండి రాజకీయాల తో పాటు రోదసీ ప్రయాణం వరకు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నారు.)
భారతీయ సంప్రదాయాలు… పరదాల చాటున దాక్కున్న రోజులవి.. కట్టుబాట్ల బంధాలతో.. ప్రతి స్త్రీ జీవితం… కుమిలిపోతున్న రోజులవి.. స్వేచ్ఛ లేని మహిళల జీవితాలు… నాలుగు గోడల మధ్య నలుగుతున్న సమయమది… కుహానా చాందస చక్రాల క్రింద నలిగి పోతూ.. కేవలం పిల్లల పెంపకం.. సేవకు అంకితమైన ఆ రోజుల్లో … ధైర్యం అనే… ఒక దీపం.. వెలిగింది… అందం చందమామ సొంతం..
కట్టుబాట్ల బంధాలను.. తెంచుకొని… ఎంతోమంది.. మహిళల జీవితాల్లో.. వెలుగు నింపే ప్రయత్నంలో.. ఆమె విజయం సాధించింది.. రాజకీయవేత్తగా… చరిత్రలో మిగిలిన అత్యంత.. సౌందర్యవతి గాయత్రి దేవి… నేటి సమాజంలో భారతీయ స్త్రీల స్థానం, దాని పునాది చరిత్రలోని కొందరు అభ్యుదయ భావాలు కలిగిన మహిళల త్యాగ నిరతి తో చేయబడింది. చరిత్రలో ఇలాంటి మహిళలు ఎందరో ఉన్నారు. పురుషులతో సమాన హక్కుల కోసం పోరాడినవారు , మహిళల స్థితిగతులను బలోపేతం చేసేందుకు అపూర్వమైన సహకారం అందించారు. అలాంటి వారిలో ముందు వరుసలో వున్న మహిళా శిరోమణి మహారాణి గాయత్రీ దేవి. భారతదేశం యొక్క అత్యంత సొగసైన, స్వతంత్ర , సంపన్న మరియు ఆధునిక మహారాణిలలో ఒకరైన గాయత్రీ దేవి మే 23, 1919న లండన్‌లో జన్మించారు.
ఆమె తండ్రి పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌కు చెందిన మహారాజా జితేంద్ర నారాయణ్ , మరియు ఆమె తల్లి మరాఠా యువరాణి, బరోడాకు చెందిన ఇందిరా రాజే , మహారాజా సాయాజీరావ్ గైక్వాడ్ III యొక్క ఏకైక కుమార్తె . గాయత్రీదేవికి భారతదేశంలోని మూడు రాచరిక రాష్ట్రాలతో సంబంధాలు ఉన్నాయి. మొదటిది, ఆమె కూచ్ బెహార్ రాచరిక రాష్ట్రానికి యువరాణి. రెండవది, ఆమె బరోడా మహారాజుకి మనవరాలు. మరియు మూడవది, ఆమె జైపూర్ మహారాజు భార్య .
గాయత్రీ దేవి అంటే ఇందిరకు అసూయ అని చాలా మంది నమ్ముతారు. కానీ మహారాణి గాయత్రీ దేవి కి నిజంగా అంత సత్తా ఉందా? మహారాణి గాయత్రీ దేవి రాజకీయ జీవితం అంత శక్తివంతమైందా? మహారాణి గాయత్రీ దేవి పుట్టుక , యువరాణి గా , మహారాణి గా రాజ జీవితం, రాజకీయ జీవితం మరియు ఇందిరతో ఆమె వివాదాల గురించి తెలుసుకోందాము .
.. గాయత్రి దీని బాల్యం..ఎంతో క్రమశిక్షణతో… కొనసాగింది… . విద్యాభ్యాసం…రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన… విశ్వభారతి లో కొనసాగింది. ఆ రోజుల్లోనే… రోజుకొక బ్రాండెడ్ కారులో పాఠశాలకు వచ్చే… గాయత్రి దేవి… … మధ్యాహ్నం భోజనం వడ్డించడానికి… 12 మంది… పనివారు… వచ్చేవారు. అధిక ధనవంతుల….. కుటుంబంలో.పుట్టి పెరిగిన గాయత్రి దేవి కు…. స్వారీ చేయడానికి గుర్రాలు… సొంత విమానం.. కలిగి ఉండేవారు. ఆ రోజుల్లో.. తమ రాజవంశస్థుల కోసం… ఒక ప్రత్యేక పాఠశాలలను నిర్మించి…. అందులో … ఒక టీచర్ గా…ఆంగ్ల పాఠాలను కూడా బోధించేవారు…
For Full details please watch the following video .https://www.youtube.com/watch?v=teI-mDG0eSQ