HYDERABAD: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్పై ఈ రోజు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు చుక్కెదురైంది.
వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు ఐన వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డిల బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే సీబీఐ కోర్టు బెయిల్ పిటిషన్ను కొట్టి వేయడంతో హైకోర్టుకి వెళ్లారు.
YS Viveka Case CBI update: ఇదిలా ఉండగా ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అంటూ సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది . ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రధాన సూత్రదారులని సీబీఐ పేర్కొంది. సెప్టెంబర్ 11న ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్టు విచారించనుంది. వైస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ విషయాన్ని సీబీఐ అఫిడవిట్ లో ప్రస్తావించింది.