Amaravathi:
Police Arrested Danda Nagendra: ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ (National Green Tribunal)కి ఫిర్యాదు చేసిన దండా నాగేంద్రపై సర్కారు కక్షసాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుక అక్రమాలపై ఎన్జీటీలో ఫిర్యాదు చేశారని నాగేంద్రకుమార్‌పై వరుస కేసులు పెట్టారు. నిన్న అరెస్ట్ చేసిన పోలీసులు జడ్జి ముందు హాజరు పరచగా రిమాండ్ రిపోర్ట్ సరిగా లేదని జడ్జి , దాన్ని సరిచేసి రమ్మన్నారు . దందా నాగేంద్ర అరెస్ట్ అక్రమం అని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు . MLA శంకర రావు పై నాగేంద్ర సతీమణి తీవ్రం గా ధ్వజమెత్తారు .
Guntur: ఆంధ్ర ప్రదేశ్ లో whistle blowers పై దాడులు ఇటీవల ఎక్కువయ్యాయి . దీనికి నిదర్శనం గా రాష్ట్రంలో ఇసుక మాఫియా పై NGT లో కేసు వేసిన అమరావతికి చెందిన దండా నాగేంద్రను అక్రమ అరెస్ట్ చేశారు . దీన్ని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఖండించారు . రాష్ట్రంలో రూ. 40 వేల కోట్ల ఇసుక అక్రమ మైనింగ్ జరిగింది. ఎన్జీటీ (NGT) కూడా ఏపీలో ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించింది. ఇసుక అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీలో దండా నాగేంద్ర కేసు వేశారు. ఎన్జీటీలో కేసు నేపథ్యంలో దండా నాగేంద్రపై వేధింపులు పెరిగాయి.
danda nagendra వైకాపా మాజీ నేత . జాతీయ హరిత ట్రిబ్యునల్ (NGT ) లో రాష్ట్రం లో జరుగుతున్నా ఇసుక అక్రమ తవ్వకాలపై కేసు దాఖలు చేశారు . గతం లో నాగేంద్ర పెదకూరపాడు MLA నంబూరి శంకర రావ్ కు అనుచరుడు గా ఉండేవారు . ఆయనతో విభేదించి చంద్రబాబు ను కలవడం కూడా జరిగింది.ఇటీవల తెదేపా ఇసుక అక్రమ తవ్వకాలపై ఆందోళనలు తీవ్రతరం చేసిన సంగతి విదితమే .
ఈ రోజు శుభకార్యంలో ఉన్న దండా నాగేంద్రను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దండా నాగేంద్రను తక్షణమే విడుదల చేయాలి. దండా నాగేంద్రకు ఏం జరిగినా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు, సీఎం జగన్ రెడ్డిలే బాధ్యత వహించాలి.” అని తెదేపా సీనియర్ నాయకుడు నక్కా ఆనందబాబు అన్నారు.