Chennai: ఏపీ మంత్రి, సినీ నటి రోజా భర్త తమిళ సినీ దర్శకుడు సెల్వమణికి ఇబ్బందులు ఎదురయ్యాయి . చెన్నై లోని జార్జిటవున్ కోర్టు ఆయనకు ఏకంగా అరెస్టు వారెంటు జారీ చేసిందని సమాచారం .
2016లో దర్శకుడు RK సెల్వమణి, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి ఒక టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన పరువు ప్రతిష్టలను కించపరిచేలా సెల్వమణి వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ప్రముఖ సినీ ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్రా జార్జిటౌన్ కోర్టులో దావా వేశారు.
ఈ కేసు విచారణకు సెల్వమణి, ఆయన తరపు న్యాయవాది గైర్హాజరు కావడంతో . దీంతో కోర్టు సెల్వ మణికి ఆరెస్టు వారెంట్ జారీ చేసింది. దీనివలన అర్ధం అవుతుందేమిటి అంటే వ్యాఖ్యలు చేసే తప్పుడు ఎదుటివారి పరువు ప్రతిష్టలకు భంగము కలిగించరాదు