ఆదివారం 27 వ తేదీ సాయంత్రం ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా, ధర్మాజీగూడెం వద్ద నారా లోకేష్ జన నీరాజనాల మధ్య ప్రవేశించింది . దారిపొడవునా ప్రజల్ని కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. 196 వ రోజు ఉదయం వలసపల్లి (కృష్ణా జిల్లా ) క్యాంపు సైట్ నుంచీ ప్రారంభమైన యాత్ర ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవంతంగా పూర్తిచేసుకుంది.
సైకో పాలనలో మోడువారిన చెట్టయ్యింది రాష్ట్రం.. భవిత భరోసాకై నిరీక్షిస్తోంది యువతరం.. ఆకుపచ్చని కలలకి రెక్కలు తొడిగి పసుపు పచ్చ జెండాని అండగా నిలిపి.. కదం తొక్కుతూ…పథం నిర్దేశిస్తూ … కదలి వచ్చింది యువగళం.. నవ్యాంధ్ర ఆశల కెరటం … ఈ క్రింది చిత్రాన్ని తిలకించండి
నేడు ఉమ్మడి కృష్ణ జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి ధర్మాజీగూడెం వద్ద చింతలపూడి నియోజకవర్గంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించన , పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 9 రోజుల పాటు 6 నియోజకవర్గాల్లో 115 కిలో మీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర సాగింది. ఇప్పటి వరకు 2,613 కిలోమీటర్ల పాదయాత్ర లోకేశ్ చేశారు. లోకేశ్‌కు పాదయాత్రకు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. రహదారులపై బారులు తీరి ఉంటున్నారు. అన్ని గ్రామాల్లో పసుపు జెండాలు రెపరెపలాతున్నాయి. ఎక్కడ చూసినా కనీవినీ ఎరగని రీతిలో స్వాగతాలు.. అడుగడుగునా హారతులు పడుతూ.. జనం యువనేత లోకేశ్‌తో పాదం కలుపుతున్నారు. 196వ రోజైన నేడు వలసపల్లి క్యాంప్ సైట్ నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. వలసపల్లిలో స్థానికులతో నారా లోకేశ్ సమావేశం కానున్నారు. ధర్మాజీగూడెం, మట్టంగూడెం, సుందర్రావుపేటల మీదుగా సాగనున్న పాదయత్ర రాత్రి బస కేంద్రానికి చేరుకోనుంది.