BJP Meeting in Khammam Today : నేడు ఖమ్మంలో ‘రైతు గోస-బీజేపీ భరోసా’ సభ..నేడు ఖమ్మం లో భాజాపా అగ్రనేత అమిత్ షా బహిరంగ సభ జరుగుతోంది . ఈ సభ నేపథ్యం … ఎన్నికలు సమీపిస్తున్న తరుణం .. కిషన్ రెడ్డి కి భాజాపా రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పిన తర్వాత జరుగుతున్న రెండవ బహిరంగ సభ . అసలే ఖమ్మం జిల్లా లో భాజాపా కు పెద్దగా ఆదరణ లేదు . జిల్లాస్థాయి నాయకులు కానీ అసెంబ్లీ స్థాయి నాయకులు గా అసలే లేరు . గత 2018 ఎన్నికల్లో 10 శాసన సభా స్థానాలకు గాను మొత్తం పొలయున ఓట్ల లో 15,855 (1%) సాధించింది .
ఇక తదుపరి జరిగిన 2019 లోకసభ ఎన్నికల్లో సుమారు 30,000 వేల ఓట్లను సాధించింది . ఈ నేపథ్యంలో అమిత్ షా సభను పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేశారు . ఈ సభకు హాజరవుతున్న కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ఖమ్మం నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారు . బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థుల ప్రకటించడం, కాంగ్రెస్ పార్టీ బలం గా వున్న ఖమ్మం జిల్లా ను , ఏమాత్రం బలం లేని భాజాపా ఎంచుకోవడం చేస్తే ఎవరి లబ్ది కోసం ఈ సభ అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి . కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను వడబోస్తున్న నేపథ్యంలో ఆదివారం జరగబోయే సభలో అమిత్ షా ఏం మాట్లాడుతారు? ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా?. బీజేపీలోకి కొత్తగా ఏమైనా చేరికలు ఉంటాయా? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా , అమిత్ షా సభ జరిగే మైదానంలో ఏర్పాటుచేసిన ప్లెక్సీల్లో ఈటల రాజేందర్ ఫోటోలు లేవంటూ నిర్వహణ కమిటీ సభ్యులను ఈటల వర్గీయులు నిలదీసారు. ఈటలను అవమానించేలా వ్యవహరించడం సరికాదని… ఇలాగయితే అమిత్ షా సభను బహిష్కరిస్తామని ఈటల వర్గీయులు హెచ్చరించారు.