భారత రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకొన్నా పరిణామాలు ప్రతిపక్షాలను ఏకం చేసే విధంగా పరిస్థితులు చోటు చేసుకొంటున్నాయి . ఇక ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ఫ్రం ఆధ్వర్యంలో ఫ్రంట్ట్ గా వున్న UPA తో జతకట్టి INDIA కూటమి గా ఏర్పడ్డాయి . ఇక కేంద్రంలో అధికారం లో వున్న భాజాపా NDA కూటమిలో వున్నా సంగతి తెలిసిందే . భారత రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ లో ఘోసి శాసన సభకు ఉపఎన్నిక సెప్టెంబర్ 5న జరిగనుంది . ఈ ఎన్నికలో రాష్టం లో అధికారం లో వున్న భాజాపా అభ్యర్థి తో ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి తలపడనున్నారు . సమాజ్‌వాదీ పార్టీ తరఫున పోటీచేస్తున్న సుధాకర్ సింగ్‌కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు పూర్తిగా సహకరించి, ఆయనకు ఘనవిజయం అందించాలి” అని రాయ్ ఆ ప్రకటనలో కోరారు.
ఈ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సింగ్‌కు కాంగ్రెస్ (Congress) పార్టీ శనివారంనాడు మద్దతు ప్రకటించడం తో ఉప ఎన్నికల్లో ప్రధాన విపక్ష పార్టీల మధ్య సయోధ్య నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి దారా సింగ్ చౌహాన్‌ను తమ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.
ఆసక్తికరంగా ఉత్తరప్రదేశ్‌లోని ఘోసీ అసెంబ్లీ స్థానానికి జరిగే ఏకైక ఉప ఎన్నికలో అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) మరియు సమాజ్‌వాదీ పార్టీ మధ్య ప్రత్యక్ష పోటీ ఉంటుంది, ఎందుకంటే కాంగ్రెస్ మరియు బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాయి. సమాజ్ వాదీ పార్టీ నుండి బిజెపిలో చేరిన దాని శాసనసభ్యుడు దారా సింగ్ చౌహాన్ రాజీనామా చేయడంతో ఘోసీ స్థానం ఖాళీ అయింది. సమాజ్‌వాదీ పార్టీ పోటీదారు మాజీ శాసనసభ్యుడు సుధాకర్ సింగ్.