ఆంధ్రప్రదేశ్ లో తెదేపా దూకుడు మీద వుంది .. అధికార వైకాపా కు తెదేపా నాయకులు , కార్యకర్తలపై పోలీసుకేసులు మినహా ఏమీ చెయ్యలేని పరిస్థితి వుంది . ఇక తెదేపా శ్రేణులు అక్రమ కేసులకు భయపడేది లేదని దూకుడు గా వ్యవహరిస్తున్నారు . ఈ తరుణం లో బయటకు వస్తున్న సర్వేలు అధికార గణం గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధం గా వున్నాయి . అవి ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం .
TIMES NOW : ఈ క్రమంలోనే టైమ్స్ నౌ ETG ఒక సర్వే ను విడుదల చేశాయి ..ఆ సర్వే లో వైకాపా కు ఆంధ్రప్రదేశ్ లో 24 లేదా 25 స్థానాలు వస్తాయని తెలియ చేసింది . ఈ సర్వే పూర్తిగా అసంబద్ధం గా ఉందని . ప్రేరేపిత సర్వే గా భావించవచ్చని , వైకాపా వర్గాలే చెబుతున్నాయి .
IPAC (Leaked ) : ఇక IPAC రిపోర్ట్ (leaked ) పేరుతొ ఒక సర్వే చక్కర్లు కొడుతోంది . ఈ సర్వే ప్రకారం అధికార వైకాపా కు 3 లోకసభా స్థానాలే వచ్చే అవకాశం ఉన్నట్లు వుంది . ఇక 16 స్థానాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లు ఆ సర్వే చెబుతోంది . మిగిలిన 6 ఎంపీ స్థానాల్లో పోటాపోటీ వాతావరణం లో , జనసేన తెదేపా కలిస్తే ఆ ఆరు స్థానాలు వైకాపా కోల్పోయే అవకాశం వుంది .
ఇక ఇండియా టుడే -c – voter తో కలిపి ఇటీవల చేసిన మూడ్ అఫ్ ది నేషన్ లో చేసిన కామెంట్స్ సంచలనం గా మారాయి . ఏపీలో అధికారవైకాపా పార్టీలో వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికిప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరిగితే NDAలో లేని టీడీపీకి 15 నుంచి 20 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. గతం లో తెదేపా అధినేత చంద్రబాబు NDA-1 కి కన్వీనర్ గా వున్నా సంగతి తెలిసిందే .
సదరు జాతీయ ఛానల్ ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటికప్పుడు తాజా రాజకీయ పరిస్థితులపై చేసిన సర్వే రిపోర్ట్స్‌ను తెలుగు తమ్ముళ్లు సోషల్ మీడియాలో ఉంచారు. ఈ రిపోర్టుల ప్రకారం గత ఏడాది కలం లో తెదేపా క్రమం గా పుంజుకుంటూ ఇప్పుడు ఆధిపత్య దిశగా ప్రయాణం చేస్తోదని తెలుస్తోంది . 2022లో ఇదే ఛానల్ తెలుగుదేశానికి ఆంధ్రప్రదేశ్‌లో 7 పార్లమెంట్ స్థానాలు మాత్రమే వస్తాయని , జనవరి 2023లో తెలుగుదేశం [పార్టీ 10 ఎంపీ సీట్లలో గెలిచే అవకాశాలున్నట్లు అంచనా వేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ఈ సర్వేలు బయటపడటం తో తమ అంచనాలకు అనుగుణంగానే ఇవి ఉన్నాయని తెదేపా శ్రేణులు భావిస్తూ , ప్రచార జోరు పెంచారు .