Sita Dayakar Reddy Entry in to Congress?
రెండు రోజుల క్రితం గులాబీ బాస్ 115 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రధాన పోటీదారు కాంగ్రెస్ కు సవాల్ విసిరారు . ఇంకా 20 నుంచీ 30 గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ని ఒకింత ఒత్తిడి లోకి నెత్తినట్లయుండి . సీటింగ్ MLA లు జంప్ జిలానీలు గా మారకుండా వారికే టికెట్ ఇట్చి కాంగ్రెస్ కు సవాల్ విసిరారు . దీనితో రేవంత్ రెడ్డి స్వంత జిల్లా ఆయన ఉమ్మడి పాలమూరులో అభ్యర్థుల వేటలో కాంగ్రెస్ పడింది .
ఇటివలే మరణించిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి (Sitadayakar reddy) కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని , ఈ మేరకు ఆమె కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం వినవస్తోంది. ఆమె కాంగ్రెస్‌లో చేరితే పార్టీ బలోపేతం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ఇప్పటికే లెక్కలు వేసుకుంటున్నాయి. నిజానికి ఉమ్మడి పాలమూరు జిల్లా లో దయాకర్ రెడ్డి, ఆయన సతీమణి సీతా దయాకర్ రెడ్డి లది ఘనమైన రాజకీయ చరిత్ర . వారు సుదీర్ఘకాలంపాటు టీడీపీలో ఉన్నారు . సీతా దయాకర్ రెడ్డి కూడా భర్తకు తోడుగా రాజకీయాల్లో 2002లో పాలమూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.
ఆ తర్వాత 2009లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం కూడావారివురూ టీడీపీలో కొంతకాలం కొనసాగారు. అయితే గతేడాది తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నారు. అనంతరం అనారోగ్యంతో కొత్తకోట దయాకర్ రెడ్డి ఇటీవల కన్నుమూశారు . ఆయన అంత్యక్రియలకు చంద్రబాబు హాజరయి పాడే మోసిన సంగతి తెలిసిందే .
ఇక సీతా దయాకర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు పై ఒక నిర్ణయం తీసుకోబోతున్నారని , ఆమె అభిమానులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరమని ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి . Kottakota కుటుంబానికి మక్తల్ , దేవరకద్ర నియోజక వర్గాల్లో పట్టు వున్నా సంగతి తెలిసిందే . టీపీసీసీ అధ్యక్షుడి తో గల సాన్నిహిత్యం తో రేవంత్ రెడ్డి పలు దఫాలు కొత్తకోట కుటుంబం తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది . రాబోయే వారం రోజుల్లో సీతా దయాకర్ రెడ్డి ఢిల్లీ లో ఖర్గే నేతృత్వాన కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు వినికిడి .