మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడాన్ని కూనంనేని సమర్థించుకున్నారు. సీఎం కేసీఆర్ ఆయన దారి ఆయన చూసుకున్నారు.. మా దారిలో మేము వెళతాం’ అని అన్నారు కూనంనేని . కేసీఆర్ను నమ్ముకుని తాము రాజకీయాలు చేయటం లేదని కమ్యూనిస్టులు సిద్దాంతంతో నడిచే పార్టీలని అన్నారు. కాంగ్రెస్ (Congress)తో కలసి వెళ్ళే దానిపై పార్టీలో చర్చ జరగలేదని, సీపీఐ (CPI), సీపీఎం (CPM)లు ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని నిర్ణయించామన్నారు. పొత్తుల కోసం బీఆర్ఎస్ వాళ్ళే మాకు ఫోన్లు చేశారని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.