ఎట్టకేలకు కేంద్ర భాజాపా తీసుకొన్న ఆంధ్రప్రదేశ్ భాజాపా ప్రక్షాళన కార్యరూపం దాల్చింది . కొత్తగా నియమితురాలైన మాజీ కేంద్ర మంత్రి , దగ్గుపాటి పురంధరేశ్వరి విస్తృతమైన ఎన్నికల కార్యవర్గాన్ని ప్రకటిచారు . కేంద్ర నాయకత్వం తో సంప్రదించి ఈ కార్వవర్గాన్ని రూపొందించినట్లు సమాచారం . రాబోయే కాలం లో రాష్ట్రం లో రానున్న కొత్త పొత్తులకు అనుగుణంగా ఈ కార్యవర్గాన్ని ఎన్నుకొన్నారు . ఇక ఇంతకాలం నాలుగేళ్లుగా పాత అధ్యక్షుడు సోము వీర్రాజు నాయత్వం లో వైకాపా కు బి టీం లా పనిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పూర్తి గా తపియించి పురంధరేశ్వరి కార్యవర్గం పై తనదైన ముద్ర వేశారు .
పాత ప్రధాన కార్యదర్సులు నలుగురిని తొలగిండం ద్వారా వైకాపా అనుకూల ముద్రను తొలగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది . గతంలో ప్రధాన కార్యదర్సులు గా వున్న మాధవ్ , విష్ణువర్ధన రెడ్డి లను ఉపాధ్యక్షులుగా మార్చారు . చందు సాంబశివరావు , విష్ణుకుమార్ రాజు , ఆది నారాయణ రెడ్డి లాంటి సీనియర్లను కూడా ఉపాధ్యక్ష పదవికి పరిమితం చేశారు .
కొత్తగా నలుగురు ప్రధాన కార్యదర్సులను చేశారు . కొత్తవారు ఈ ఛాన్స్ దక్కించుకున్నారు . 1. విస్వనాథ రాజు 2. బిట్రా శివన్నారాయణ . 3 దయాకర్ రెడ్డి 4. గారపాటి తపన చౌదరి .. .
బీజేపీలో వివిధ మోర్చాల అధ్యక్షులను దగ్గుబాటి పురందేశ్వరి ప్రకటించారు.
యువమోర్చా ప్రెసిడెంట్ మిట్ట వంశీ
మహిళా మోర్చా ప్రెసిడెంట్ బి నిర్మలా కిషోర్
కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ చ. కుమార్ స్వామి
ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ గుడిసె దేవానంద్
OBC మోర్చా ప్రెసిడెంట్ ఉమామహేశ్వరరావు
మైనారిటీ మోర్చా అధ్యక్షుడు SK బాజీ
మీడియా ఇంఛార్జ్ పాతూరి నాగభూషణం
ఇక అధికార ప్రతినిధులుగా :
పూడి తిరుపతి రావు, లంక దినకర్ ,సుధీష్ రాంబట్ల, RD విల్సన్, సాదినేని యామినీ శర్మ
పెద్దిరెడ్డి రవికిరణ్, డాక్టర్ వినుషా రెడ్డి