భారాసా గా తెరాసా మారి జాతీయ పార్టీగా అవతరించినప్పటినుండీ ఇతర రాష్ట్రాల్లో వ్యాపించే క్రమంలో.. మహారాష్ట్రపై ప్రత్యేకంగా గులాబీ నేత కెసిర్ దృష్టి సారించారు . ఈ క్రమంలోనే కీలక నేతలు కూడా బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా చేరికలు వున్నాయి . మహారాష్ట్ర భారాసా ఇన్ ఛార్జ్ గా Kalvakuntla Vamshidhar Rao నియమించారు . కేవలం నేతలే కాకుండా.. ఇప్పుడు పార్టీలు కూడా విలీనం అవుతున్నాయి.
- మహారాష్ట్రలోని స్వరాజ్య మహిళ సంఘటన్ పార్టీ విలీనం
- కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరిన నేతలు
మహారాష్ట్ర లో భారీ బహిరంగ సభలు నిర్వహించటం.. కీలక స్థానిక నేతలను చేర్చుకోవటంతో మరాఠా నాయకులను , ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో కేసీఆర్ కొంతవరకూ విజయం సాధించినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని క్రాంతికారీ శేత్కరీ పార్టీ బీఆర్ఎస్‌లో విలీనం అయుంది .
ఇప్పుడు మరో పార్టీ స్వరాజ్య మహిళ సంఘటన్ పార్టీ విలీనం అయ్యుంది . స్వరాజ్య మహిళ సంఘటన్ అధ్యక్షురాలు వనితా తాయి గుట్టే, గులాబీ బాస్ కెసిఆర్ సమక్షంలో తమ అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వీళ్లతో పాటు మహారాష్ట్ర బీజేపీ నాయకులు భయ్యా సాహెల్ పాటిల్, అర్జున్ వాంఖడే , ఎన్సీపీ కార్పొరేటర్ జయంత్ చౌదరి, శివసేన నాయకుడు దత్తరాజ్ దేశ్ ముఖ్ వారి అనుచరులతో కూడా భారాసా కండువాలు వేసుకొన్నారు . రాబోయే కలం లో ఎన్ని చేరికలుంటాయో వేచి చూద్దాం మరి .