ప్రధాని గా Narendra Modi 10 వ సారి ఎర్రకోట పై నుండీ జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు . ఎర్రకోటలో వేడుకలు తిలకించేందుకు దేశంలోని వివిధ రంగాల నుంచి సుమారు 1,800 మందికి ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందింది. గత ఏడాదితో పోల్చితే… ఈ ఏడాది అధిక సంఖ్యలో అతిథులకు ఆహ్వానాలు అందాయి. ‘జన భాగస్వామ్యం’ పేరిట ఈ ఆహ్వానం ఉజ్వల గ్రామాల కు చెందిన 400 మంది సర్పంచులు తో పాటు 660 మందిని పంపారు.
గతం లో కంటే ఇప్పుడు భారత దేశ సరిహద్దులు సురక్షితం గా ఉన్నాయన్నారు నరేంద్ర మోడీ . మణిపూర్ రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు, మణిపూర్ సమస్య పరిష్కారం శాంతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ప్రధాని అన్నారు . గత కొన్ని వారాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా మణిపూర్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. భారత దేశ ఆడబిడ్డల గౌరవ, మర్యాదలకు తీవ్ర భంగం కలిగిందని చెప్పారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అక్కడ ప్రశాంతత ఏర్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రధాని మోడీ తన ప్రసంగం లో తెలిపారు .
- వచ్చే ఐదేళ్లలో భారత్ మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందన్నది మోదీ హామీ అని ఆయన అన్నారు.
- గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదలు పేదరికం నుండి బయటపడ్డారని, నియో-మధ్యతరగతి, మధ్యతరగతి వర్గాల్లో భాగమయ్యారని ప్రధాని చెప్పారు. 2047లో దేశం 100వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించనుందని ఆయన అన్నారు.
- చివరగా, ప్రజల ఆశీస్సులు తనకు ఉంటే వచ్చే ఏడాది తిరిగి వస్తానని చెప్పారు.
నరేంద్ర మోడీ దేశ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా అంటే ‘‘పరివార్జన్’’ గా సంబోధిస్తూ ప్రసంగం మొదలు పెట్టారు . గతంలో నరేంద్ర మోడీ దేశ ప్రజలను ‘‘నా ప్రియమైన సోదర, సోదరీమణులారా’’ అని సంబోధించేవారు.