Bullion Market: iఇటీవల బంగారం, వెండి ధరలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బంగారం ధర అయితే కొద్దిగా తగ్గడమో లేదంటే స్థిరంగా ఉండటమో జరిగింది. బంగారం ధర పెరగడమనేది అయితే ఈ మధ్య కాలంలో జరగలేదనే చెప్పాలి. నేడు బంగారం ధర అయితే స్థిరంగా ఉంది. కానీ వెండి ధర ఊహించని స్థాయిలో తగ్గిపోయింది. నేడు వెండి ధర కిలోకి రూ. 3,200 తగ్గడం విశేషం.
శ్రావణ మాసం వస్తోంది కాబట్టి కొనుగోలుదారులు బంగారం, వెండి కొనుగోళ్ల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు . హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.54,650.. 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.59,620
ఇక కిలో వెండి ధర RS 73,000 గా వుంది .