స్పీడు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ . ఒక పక్క కేంద్ర నాయకత్వం వైస్ షర్మిల రెడ్డి తో డీల్ ఓకే కథలు వస్తున్నా తరుణంలో టీపీసీసీ అధ్యఖుడు రేవంత్ రెడ్డి కూడా స్పీడ్ పెంచారు . అంది వస్తున్న అవకాశాలను ఒడిసి పట్టుకుంటున్నారు . రాజకీయ ప్రత్యర్థులు గడ్డం ప్రసాద్, ఏ. చంద్రశేఖర్ చేతులు కలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఉద్యమ ఆకాంక్షల కోసం కలిసి పని చేయాలని వారిద్దరికీ విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న రాజకీయ పునరేకీకరణలో భాగంగా ఏ.చంద్రశేఖర్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 18న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో పర్యటిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళిత గిరిజనులకు సంపూర్ణ యాజమాన్య హక్కులు ఇస్తామన్నారు. పేదల భూములు కాపాడాల్సిన ప్రభుత్వమే కబ్జా కోరుగా మారిందని బీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చాలామంది కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని రేవంత్ రెడ్డి బాంబు పేల్చారు. రాష్ట్రంలో కేసీఆర్.. కేంద్రంలో మోదీ ఉండాలని ఒకరికొకరు సహకరించుకుంటున్నారు అని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ పంచాయితీ, గిరిజన లంబాడీల పంచాయితీని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెంచుతామని ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని నివారించటానికి ఉద్యమకారులను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నాం అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ నెల 18న చేవెళ్లల్లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారని వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఇక, ఇదే సభలోనే మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం.
ఇక ఈరోజు ఉదయం రాజీనామా చేసిన చంద్రశేఖర్ TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు (BRS) కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని దీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను బీజేపీ కాపాడుతోందని అన్నారు. బీజేపీ విధానాలు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.