ఆంధ్ర ప్రదేశ్ లో స్థిరాస్తి రంగం లో వృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన వుంది . తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ఆయన తెలంగాణా నిర్మాణాల్లో , క్రయవిక్రయాల్లో దూసుకుపోతోంది. ఇటీవల కోకాపేట లో ఎకరం 100 కోట్లకు వేలం జరిగిన విషయం అందరికి విదితమే . ఇక తెలంగాణ జిల్లాలలో 2014 ప్రాంతం లో ఎకరం 2 లక్షలు వుండే భూమి ఇప్పుడు 15 లక్షల నుండీ 40 లక్షల వరకూ పెరిగింది . ఇక GHMC పరిధిలో రియల్ ఎస్టేట్ కు పగ్గాలు లేవు . శరవేగం తో అభివృద్ధి చెందుతోంది .
ఆంధ్ర ప్రదేశ్ లో స్థిరాస్తి రంగం గతం లో ఎన్నడూ లేనంతగా వెల వెల పోతుంది . రిజిస్ట్రేషన్ల ఆదాయ పరం గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏంటో వెనుకబడి వుంది . స్థిరాస్తి రంగం లో 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తదుపరి చంద్రబాబు నాయుడు చొరవతో అమరావతి ప్రాంతం శరవేగం గా అభివృద్ధి పధం వైపు అడుగులు వేసింది . అయితే 2019 లో అధికార మార్పు , అమరావతి రాజధాని ప్రాంతం లో స్థిరాస్తి రంగం లో కుదేలయుంది. గ్రోత్ ఇంజిన్ గా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగిన అమరావతి ని పాలకులు ముంచేశారు . 3 రాజధానుల వ్యవహారం కోర్టు వివాదాల్లో వుంది .
పరిశ్రమలు కొత్తవి రాకపోగా వున్న పరిశ్రమలు పోయాయి . స్థిరాస్తి అమ్ముదామంటే కొనే నాధుడే లేకుండా పోయారు . రహదారులు రాష్ట్ర వ్యాప్తం గా గుంతల మయం గా మారాయి . మౌలిక సదుపాయాల కల్పన ప్రకటనలకే పరిమిత మయ్యుంది . అయితే నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నారెడ్కో) ప్రధాన కార్యదర్శి మామిడి సీతారామయ్య మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి ఐటి కంపెనీలు మరియు ఇతర పరిశ్రమల స్థాపనపై ఎక్కువగా ఆధారపడి ఉందని అన్నారు . క్రెడాయ్ మాజీ చైర్మన్ ఎ శివా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని అన్నారు. “పరిశ్రమలో వృద్ధి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి, రాష్ట్ర రాజధాని నగరానికి సంబంధించి తక్షణమే స్పష్టత అవసరం,” అన్నారు .
అయితే 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో కనిపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అధికార మార్పిడి దిశగా ప్రయాణం చేస్తున్నాయి. NRI ఇన్వెస్టర్లు రాక మొదలైంది . హైదరాబాద్ , బెంగుళూరు ల నుంచీ స్థిరాస్తి వ్యాపార లావాదేవీలు మొదలయ్యాయి అని స్థానిక స్థిరాస్తి సంస్థల ద్వారా తెలుస్తోంది . కొత్త ప్రభుత్వం రావడం ఖాయం గా కనిపించడం తో , హైదరాబాద్ లో స్థిరాస్తి వ్యాపారం ఖరీదైనది గా మారడం తో కొంతమంది దృష్టి అమరావతి వైపు మారినట్లు సమాచారం . స్థిరాస్తి (భూములు ) రేట్లు 6% నుంచీ 12% శాతం పెరిగినట్లు తెలుస్తోంది . ఇక రాష్ట్రము లోని రాజమండ్రి , వైజాగ్ , తిరుపతి , కర్నూల్ ముఖ్య పట్టణాల్లో కూడా ఇదే స్థాయి లో పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది . ఆంధ్ర ప్రదేశ్ లో స్థిరాస్తి రంగం లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అని స్థిరాస్తి రంగ ఆర్ధిక నిపుణుల సమాచారం.