ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి గుంటూరు జిల్లా లోని తెనాలి అసెంబ్లీ కి రాజకీయ ప్రాముఖ్యత కలిగినది . ఇక్కడ నుండీ హేమాహేమీలైన నేతలు అనేకమంది ప్రాతినిధ్యం వహించారు . ఇది గుంటూరు లోక సభా పరిధిలోకి వచ్చే నియోజక వర్గం . సుమారు 2 లక్షల 60 వేల ఓటర్లు . సెమి అర్బన్ నియోజకవర్గం .. తెనాలి మున్సిపాలిటీ తో పాటు కొల్లిపర మరియు తెనాలి రురల్ మండలాలు వున్నాయి . ఇక్కడ నుండీ ప్రాతినిధ్యం వహించిన ప్రముఖులు .. 1950 దశకం రాజకీయాల్లో పంచ పాండవులు గా చెప్పబడే వారిలో చిన్న వయస్సు కలిగిన ఆలపాటి వెంకటరామయ్య . 1952, 1955, 1962. ఆలపాటి వెంకటరామయ్య అతి చిన్న వయస్సు లోనే మంత్రి గా పని చేస్తూ చనిపోయారు .
ఆలపాటి వెంకటరామయ్య మీద గల అభిమానం తో కాంగ్రెస్ పార్టీ ఆమె కుమార్తె దొడ్డపనేని ఇందిర ను ఆదరించింది . ఆమె కూడా 1967, 1972 and 1978 లలో MLA గా గెలుపొందారు . తండ్రి వాలే ఆమె కూడా అతి పిన్న వయసు లోనే 50 ఏళ్లకే అకాల మరణం చెందారు . 1999 లో ఆలపాటి వెంకటరామయ్య గారి మనుమరాలు డాక్టర్ గోగినేని ఉమ తెదేపా తరపున ఉద్దండుడు కొణిజేటి రోశయ్య పై గెలిచి చంద్ర బాబు మంత్రివర్గం లో మంత్రి గా పనిచేశారు . ఇక ప్రస్తుత MLA ిన అన్నాబత్తుని శివ కుమార్ తండ్రి అన్నాబత్తుని సత్యన్నారాయణ తెదేపా నుంచీ 2 సార్లు 1983, 1985 లో గెలుపొందారు . వారు మంత్రి గా కూడా ఎన్టీఆర్ మంత్రివర్గం లో పని చేశారు . ఇక మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు 1989 లో కాంగ్రెస్ అభ్యర్థి గా గెలుపొందగా వారి కుమారుడు నాదెండ్ల మనోహర్ 2004,2009 ల లో వరుసగా గెలుపొందాయి అసెంబ్లీ స్పీకర్ గా కూడా పనిచేశారు . 2014 లో మాత్రం తెదేపా సీనియర్ నాయకుడు ఆలపాటి రాజా ఇక్కడ నుండీ గెలుపొందారు .
ప్రస్తుతం 2024 ఎన్నికల్లో తెదేపా జనసేన మధ్య పొత్తు ఖాయం గా కనిపిస్తోంది . వైకాపా రహిత రాష్ట్రాన్ని చూడడమే లక్ష్యం గా జనసేనాని అడుగులు వేస్తున్నారు . జనసేన లో నెంబర్ 2 గా వున్న నాదెండ్ల మనోహర్ ఈసారి తెనాలి బరిలో దిగే అవకాశాలు మిక్కిలి గా వున్నాయి . ఇక ఆలపాటి రాజా కు తెదేపా గుంటూరు వెస్ట్ లేదా, గల్లా జయదేవ్ విముఖత చూపే పక్షం లో గుంటూరు లోక సభా స్థానాలు లేదా MLC గా అవకాశం కల్పించే వీలు వుంది .
2024 ఎన్నికల్లో ఇక్కడ ముఖాముఖీ పోరు జరిగే అవకాశం స్పష్టం గా వుంది . అధికార వైకాపా కు అన్నాబత్తుని శివకుమార్ వినా వేరే అభ్యర్థి లేరు . తెదేపా జనసేన పొత్తులో భాగం గా మనోహర్ జనసేన అభ్యర్థి గా బరిలో దిగితే వార్ వన్ సైడ్ గా జరిగే అవకాశం . రాష్ట్ర వ్యాప్తం గా వీస్తున్న వైకాపా వ్యతిరేక పవనాలు తెనాలి ప్రాంతం లో వాయుగుండం గా మారె అవకాశం వుంది . గెలుపే లక్ష్యం గా మనోహర్ అడుగులు వేస్తున్నారు . కొల్లిపర మండలం లో బలమైన కీ . శే. గుడిబండ వెంకటరెడ్డి కుమారుడు తెదేపా లో చేరడం కలసి వచ్చే అంశం.