ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల తదుపరి బాగా వేడెక్కాయి . తెదేపా 3 స్థానాల్లో ఘానా విజయం సాధించి సత్తా చాటింది . గత అసెంబ్లీ ఎన్నికల తదుపరి అధినేత కు మొహం చాటేసి , పార్టీ కార్యక్రమాలను మమ : అనిపిస్తున్న నేతలందరు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు . చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న ప్రజానీకాన్ని చూసి నాయకులు రంగంలోకి దూకి మేము సైతం సై అంటున్నారు .
పెందుర్తి లో మొత్తం నాలుగు మండలాలు వున్నాయి :
1978 నుంచీ గెలిచినా శాసన సభ్యులు
ఇక నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర , ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా జరుగుతోంది . ఈ నేపధ్యం లోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతమ్ 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటన లో వున్నారు .
పెందుర్తి లో చంద్రబాబు రోడ్ షో చేసి బహిరంగ సభ లో ప్రసంగించారు .
ఈ పెందుర్తి నియోజకవర్గం ఉమ్మడి విశాఖ జిల్లాలో అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోనిది . ఇక్కడ బండారు సత్యనారాయణ మూర్తి ఒకసారి 2014 లో గెలుపొందారు . అంతకు ముందు పరవాడ అసెంబ్లీ గా వున్నప్పుడు 3 సార్లు బండారు గెలవడం జరిగింది . బండారు చంద్రబాబు మంత్రివర్గం లో మంత్రి గా కూడా పని చేశారు . 2019 లో గెలిచిన వైసీపీ ANNAMREDDY ADEEP RAJ రాజకీయానికి పాతవాడే అయినా వయసు , సీనియారిటీ తక్కువ కావడం తో కొన్ని ఇబ్బందులు వైసీపీ సీనియర్ల నుండీ mla కు వస్తున్నాయి . ఇక్కడ భూ కబ్జా లు ప్రధానమైన సమస్య గా మారాయి .
బుధవారం రాత్రి పెందుర్తిలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి…’ కార్యక్రమం సూపర్ సక్సెస్ అయింది. కార్యక్రమానికి జనం పోటెత్తారు . పెందుర్తి కిక్కిరిసిపోయింది. చంద్రబాబునాయుడు సుమారు 50 నిమిషాలు పైగా చేసిన ప్రసంగాన్ని ప్రజలంతా ఆధ్యంతం ఆలకించడంతో పాటు మధ్యమధ్యలో చప్పట్లతో , కేకలతో హోరెత్తించారు .
టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ సర్కారు తెచ్చిన జీవో 217ను రద్దు చేసి , స్థానిక చేపల చెరువులోని చేపలను పట్టుకునే హక్కు స్థానిక మత్స్యకారులకే ఉండేలా చేస్తామని హామీ ఇచ్చారు . పెందుర్తి నియోజకవర్గం లో జనసేన బలం గానే వుంది . 25 వేల పైచిలుకు ఓట్లను జనసేన ప్రభావితం చెయ్యగలడు . జనసేనాని ఖరాఖండి గా వైసీపీ విముఖ్త ఆంధ్రప్రదేశ్ కోసం తెదేపా తో పొత్తు ఖాయం గ కనిపిస్తున్న ఈ తరుణం లో పెందుర్తి వైసీపీ కి గడ్డు రోజులొచ్చాయనే చెప్పాలి .
ఈ సారి పెందుర్తి లో తెదేపా విజయం నల్లేరుమీద నడకేనా !? …మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి …