లోకసభలో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై నేడు సంచలన వాద ప్రతివాదాలు జరిగాయి . ప్రతిపక్ష కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రత్యక్షం గా పాల్గొన్నారు . ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, ‘‘స్పీకర్ సార్, లోక్ సభలో నన్ను పునర్నియమించినందుకు ధన్యవాదాలు. గతంలో నేను మాట్లాడినపుడు, నేను అదానీ మీద, మీ సీనియర్ నేతల మీద ఎక్కువ దృష్టి పెట్టాను. అందువల్ల నేను బహుశా మిమ్మల్ని బాధించి ఉంటాను. ఈరోజు నేను అదానీ గురించి మాట్లాడను’’ అని చెప్పారు.
సుప్రసిద్ధ పర్షియన్ కవి రుమిని రాహుల్ గాంధీ ప్రస్తావిస్తూ , తాను బీజేపీ మీద అన్ని వైపుల నుంచి దాడి చేయబోవడం లేదు . నా హృదయాంతరాళాల్లోంచి మాట్లాడాలనుకుంటున్నాను . ఈసారి ప్రభుత్వంపై భీకరంగా విమర్శల దాడి చేయబోను. భారత్ జోడో యాత్ర సందర్భంగా నాకు చాలా మంది గొప్ప శక్తిని, బలాన్ని అందించారు. ఈ యాత్రలో నాకు ఓ బాలిక ఓ లేఖ ఇచ్చింది . దానిలో , ‘‘రాహుల్, నేను మీతో కలిసి నడుస్తున్నాను’’ అని ఉంది . ఆమె మాత్రమే కాకుండా అనేక మంది నాకు బలాన్ని ఇచ్చారని చెప్పారు. బలాన్నిచ్చినవారిలో రైతులు కూడా ఉన్నారు . నాలో అహంకారం ఉండేది , అహంకారంతోనే తాను భారత్ జోడో యాత్రను ప్రారంభించాను. కానీ భారత్ జోడో నా జీవితాన్ని మార్చేసింది , యాత్రలో నిజమైన భారత దేశాన్ని చూశాను. ప్రజా గళాన్ని విన్నాను. పేదల బాధలనుఅర్ధం చేసుకొన్నా .
హింసాత్మక ఘర్షణలు జరుగుతున్న మణిపూర్ రాష్ట్రంలో తాను పర్యటించా. సహాయక శిబిరాలకు వెళ్లా..దురాగతాలను ఎదుర్కొన్న మహిళలతో మాట్లాడాను …కుమారుల మృతదేహాల వద్ద ఉన్న తల్లులతో మాట్లాడా…భయానక సంఘటనల గురించి చెప్పేటపుడు ఆ మహిళలు స్పృహ కోల్పోయారు …ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆ రాష్ట్రంలో పర్యటించలేదు .. బీజేపీ ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించారన్నారు. ప్రధాని ఎన్నడూ మణిపూర్ రాష్ట్రానికి వెళ్ళలేదు . మణిపూర్ ఇక ఉండబోదు . మణిపూర్ మహిళల బాధలు బీజేపీకి అర్థం కావడంలేదు .. భారత దేశ ఆత్మను ప్రభుత్వం హత్య చేసింది , మణిపూర్‌లో భారత మాతను హత్య చేశారు ..భాజాపా నేతలు ద్రోహులు ..
రావణాసురుడు మేఘనాథుడు, కుంభకర్ణుడు చెప్పిన మాటలనే వినేవాడు , మోదీ కూడా ఇద్దరి మాటలనే వింటారు .. వారిద్దరూ అమిత్ షా, అదానీ.. ఇలా రాహుల్ గాంధీ చేసిన తీవ్ర ప్రసంగం తో అధికార భాజాపా సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం మధ్య రాహుల్ గాంధీ లోక్ సభ నుంచి వెళ్లిపోయారు.