ఒకసారి అధికరక్తపోటు వచ్చింది అంటే, మంచి డాక్టర్లు వెంటనే అధిక రక్తపోటు తగ్గే మందులు ఇవ్వరు. ఒక పది రోజులు వారి పర్యవేక్షణలో ఉదయం సాయంత్రం యెంత అధికరక్తపోటు నమోదు అవుతుందో చూసి తగిన మోతాదుతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు .అధికరక్తపోటు ఒకసారి వచ్చిన తరువాత తగ్గదు ,అల్లోపతి అయినా ఆయుర్వేదం అయినా హోమియోపతి డాక్టర్స్ అయినా అది వాడండి ఇది వాడండి తగ్గిపోతుంది అంటారు కానీ తగ్గదు ,అధికరక్తపోటు తగ్గాలి అంటే మొట్టమొదటిగా ముందు మీ అనవసర ఆలోచనలకు దూరముగా ఉండాలి ఇది నిజం . రెండవది కల్లుఉప్పు ,రాళ్ల ఉప్పు ,సైన్ధవలవనం ఏ ఉప్పు అయినా సరే ప్రమాదమే దూరం పెట్టాలి,ఉప్పువాడకం బాగా తగ్గించేసి తినాలి .
ఈ అధికరక్తపోటు తగ్గాలి అన్న కంట్రోల్ లో ఉండాలి అన్న మీరు పాటించాల్సిన కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
ఉదయం కాలకృత్యాలు తీర్చుకోగానే గోరువెచ్చని నీళ్లలో అర చెక్క నిమ్మకాయ రసం పిండుకుని తాగండి .
తెల్లవారుజామున 45 నిముషాలు ఎవరితో మాట్లాడకుండా ఫోన్ వినకుండా చూడకుండ స్పీడ్ వాక్ చెయ్యాలి . 30 నిముషాలు సాధారణ వ్యాయామం చెయ్యాలి ,ఇలా రోజు ఉదయం 4. 45 నుంచి 6గంటల సమయంలో చెయ్యడం వలన మీకు మంచి ఆక్సిజన్ అందుతుంది అధికరక్తపోటు అనేది కంట్రోల్ లో ఉంటుంది. మీరు రోజు తినే ఆహారంలో తాజా పళ్ళు కూరగాయలు చేర్చుకోండి.
.ఫ్రూట్స్ తినండి . ఉడికించిన కూరగాయ ముక్కలు తినండి ,ముఖ్యముగా ఉడికించిన చిలకడ దుంప తినండి ఇందులో అధిక రక్తపోటుని కంట్రోల్ లో ఉంచే పోషక విలువలు ఉన్నాయి .వారానికి రెండు సార్లు ఒక గుప్పెడు కరివేపాకు శుభ్రముగా కడగి జ్యూస్ చేసుకుని కొంచెం కడుపు కాళీగా ఉన్నపుడు తాగండి. పండిన అరటిపళ్ళు తినండి ,బీట్రూట్ జ్యూస్ తాగండి,రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి మింగండి ,కీర జ్యూస్ రోజు ఒక గ్లాస్ తాగండి అధికరక్తపోటు నిలకడగా ఉంటుంది.
బాడ్ హాబిట్స్ వదిలి ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉంటె ఎటువంటి వారికీ అయినా అధికరక్తపోటు వారి ఆదీనంలో ఉంటుంది .
ఉప్పుని ఆలోచనలని యెంత దూరం పెడితే అధికరక్తపోటు నుంచి అంత త్వరగా విముక్తులు అవుతారు . ఆరోగ్యమే మహాభాగ్యం మా చిట్కాలే మీకు సంపూర్ణ ఆరోగ్యం.