మోడీ పదం వాడుక పై పరువు నష్టం దావాలో రెండేళ్ల జైలు శిక్షకు గురైన కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు స్టే తో ఉపశమనం లభించింది . ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మిన్నంటాయి . కాంగ్రెస్ పార్టీ యొక్క మిత్రపక్షాలు కూడా ఈ సుప్రీంతీర్పుపై ఆనందాన్ని ప్రకటించాయి. ఈ నేపథ్యం లో బీహార్ అగ్ర నేత లాలూ ప్రసాద్ యాదవ్ , రాహుల్ గాంధీ ని ఢిల్లీ లోని తన కుమార్తె మీసా భారతి నివాసానికి విందుకు ఆహ్వానించారు . ఇందుకోసం ఆయన బీహార్ నుంచీ ప్రత్యేకంగా మటన్ తెప్పించి , తానే స్వయం గా వండారు .
శుక్రవారం రాత్రి తన కుమారుడు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తో కలిసి రాహుల్ గాంధీని ఇంట్లోకి స్వాగతించారు. పూల బొకే ఇచ్చి రాహుల్ గాంధీ ని ఆప్యాయంగా హత్తుకుని కుమార్తె ఇంట్లోకి ఆయన తీసుకెళ్లారు. లాలూ ప్రసాద్ యాదవ్ స్వయం గా రాహుల్ కు వడ్డించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పుతో పాటు దేశ రాజకీయాలపై వారివురు మధ్య రాజకీయ చర్చ జరిగిందని లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహిత వర్గాలు ద్వారా తెలుస్తోంది .
आज @RahulGandhi जी ने RJD अध्यक्ष @laluprasadrjd जी से उनके दिल्ली स्थित निवास पर मुलाकात की। pic.twitter.com/NMXa4jP8hi
— Congress (@INCIndia) August 4, 2023