Monday, February 3, 2025
spot_img
HomeNewsAndhra PradeshRahul Gandhi Gets relief in Supreme Court ! గుజరాత్ హై కోర్ట్ ఉత్తర్వుల...

Rahul Gandhi Gets relief in Supreme Court ! గుజరాత్ హై కోర్ట్ ఉత్తర్వుల పై స్టే !!

ఎట్టకేలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి సుప్రీమ్ కోర్ట్ లో ఉపశమనం లభించింది . మోదీ ఇంటిపేరు’ వ్యాఖ్య చేసినందుకు క్రిమినల్ పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారిస్తూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై నేడు సుప్రీంకోర్టు స్టే విధించింది.

రాహుల్ గాంధీ ఇప్పుడు పార్లమెంటు సమావేశాలకు అటెండ్ కావడానికి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది .

మెంబెర్ అఫ్ పార్లమెంట్ హోదాను పునరుద్ధరించింది .

గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎలాంటి కారణాలు చెప్పలేదని సుప్రీంకోర్టు పేర్కొంది.

అనర్హత రాహుల్ గాంధీని మాత్రమే కాకుండా ఆయన నియోజకవర్గ ఓటర్లను కూడా ప్రభావితం చేస్తుంది. 

అయితే, ఆరోపించిన వ్యాఖ్యలు చేయడంలో గాంధీ మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది. 

రాహుల్ గాంధీ తరపున సుప్రీంకోర్టుకు హాజరైన అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ‘రాహుల్ గాంధీ తన ప్రసంగంలో ఎవరి పేరునూ ప్రస్తావించలేదు’ అని అన్నారు

ఈ పరిణామంతో దేశవ్యాప్తం గా కాంగ్రెస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments