ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేత మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు Ex MLA Jupalli Krishnarao కాంగ్రెస్ గూటికి నేడు చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు కూచుకుల్ల రాజేశ్ రెడ్డి, వనపర్తి నేత మెగారెడ్డి, IPS నాగరాజు , జీవన్ . కొడంగల్ మాజీ శాసనసభ్యులు గుర్నాథ్ రెడ్డితో సహా పలువురు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ఖ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నిజానికి వీరందరూ గత నెల 30 నే ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ లో చేరాల్సి ఉండగా ,గత 10 రోజులుగా ఖుస్రుసిన వర్షాల కారణం గా ఆ సభ రద్దయిన సంగతి తెలిసిందే …
ఈ కార్యక్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మల్లు రవి , సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భం గా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ ను ఇచ్చిన తల్లి సోనియమ్మ ఋణం తీర్చుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధం గా ఉందన్నారు . భారాసా ను వదిలి కాంగ్రెస్ లోకి రావడం తనకు సంతోషం గా ఉందన్నారు .కాంగ్రెస్ అధిష్టానం , రేవంత్ రెడ్డి ఇటిచ్చినా ఘర్ వాపసీ పిలుపు తనను ఆలోచింపచేసిందన్నారు . ఇక కెసిఆర్ మాయ మాటలు నమ్మడానికి తెలంగాణా లో ఎవరూ సిద్ధం గా లేదన్నారు . కెసిఆర్ నియంత ప్రభుత్వాన్ని దించడానికి తన సర్వ శక్తులు ఒడ్డుతానన్నారు .
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో తనతో పాటు ఏంటో మందికి ఇవ్వని సెక్యూరిటీ ఒక్క ఈటెల రాజేందర్ కు ఇచ్చారు . కెసిఆర్ రాజకీయ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ కోసం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు . కెసిఆర్ లిక్కర్ కింగ్ గా మారారు . లిక్కర్ నే నమ్ముకున్నారు . భారాసా , బీజేపీ కలసి పనిచేస్తున్నాయని బహిర్గతమైన దృష్ట్యా , బీజేపీ తెరాసలో వున్న తెలంగాణా వాదులు బయటకు వచ్చి చేయు కలిపి పోరాడాలన్నారు . మణికం ఠాక్రే మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణా లో విజయం దిశగా ప్రయాణం చేస్తుందన్నారు .
ఇక మురళీధరన్ చైర్మన్గా జిగ్నేశ్ మేవానీ, బాబా సిద్దిఖ్ సభ్యులుగా స్క్రీనింగ్క కమిటీ ఏర్పాటు
పీసీసీ చీఫ్ రేవంత్, భట్టి, ఉత్తమ్ దీనిలో సభ్యులు . ఈ నెలాఖరులోగానే 80 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించడంతోపాటు ఆశావహుల నుంచి వచ్చే దరఖాస్తుల పరిశీలనకు టీపీసీసీ ప్రదేశ్ ఎన్నికల కమిటీని కూడా నియమించింది. ఆ జాబితాను తాజాగా ఏర్పాటైన స్ర్కీనింగ్ కమిటీ మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి మరో జాబితాను ఖరారు చేసి ఏఐసీసీకి సమర్పిస్తుంది. ఈ పరిణామాలతో తెలంగాణ కాంగ్రెస్ తాను రాబోయే శాసనసభ ఎన్నికలకు సిద్ధమని చెపుతున్నట్లయుంది.