Monday, February 3, 2025
spot_img
HomeNewsతెలంగాణ రైతులకు రుణ మాఫీ ... 31 లక్షల రైతులకు లబ్ది !?

తెలంగాణ రైతులకు రుణ మాఫీ … 31 లక్షల రైతులకు లబ్ది !?

ఎన్నికల వేళ తెలంగాణ ప్రభుత్వం మరో వరం అమలుకు శ్రీకారం చుట్టింది . అదే 31 లక్షల రైతులకు రుణ మాఫీ … నిన్న ప్రగతిభవన్ లో సమీక్ష జరిపి అధికారులకు , ఆర్ధిక శాఖ కు ఆదేశాలిచ్చారు ముఖ్యమంత్రి కెసిఆర్ . రైతులకిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం అని కెసిఆర్ చెప్పారు . దీనివల్ల ఆర్ధిక శాఖ సుమారు 19 వేల కోట్లు సర్దుబాటు చెయ్యాల్సి ఉంటుంది .

గతం లో ఇచిన హామీ మేరకు కెసిఆర్ ఒక లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తూ తీసుకొన్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది . ఇటీవలి వర్షాల వల్ల అతలాకుతలం ఆయన రైతాంగానికి ఈ రుణ మాఫీ కొంత ఉపశమనం ఇస్తుందనడం లో ఎలాంటి సందేహం లేదు .

ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఉద్యమాలు , పోరాటాలు మరియు కాంగ్రెస్ మానిఫెస్టోలో రైతు రుణమాఫీ హామీ ల వల్లే సీఎం కెసిఆర్ ఇప్పుడు దిగివచ్చి , రుణమాఫీ చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి . ఇటీవల కాంగ్రెస్ బృందం చీఫ్ సెక్రటరీ శాంత కుమారి ని కలసి రుణమాఫీ ని పూర్తి స్థాయిలో అమలు జరపాలని కోరిన విషయం తెలిసిందే . లేకపోతె బ్యాంకుల ముందు ధర్నా చేస్తామని కాంగ్రెస్ బృందం తెలిపింది . ఏది ఏమైనా ఎవరి ఒత్తిడి వలన అయినా తెరాసా అధినేత కెసిఆర్ రుణమాఫీ పట్ల తీసుకున్న నిర్ణయం హర్షణీయమే !?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments